ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 2 April 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---67 ) (02-04-2013)
జరిగినదంతా ఒక కలలా...ఒక సినిమా కథలా అనిపిస్తుంది మోహనకు...అంజలిని మాటలతో మభ్యపెట్టి,తను బయటపడింది.తనకు ఎక్కువ టైం లేదు.ఒక పారశ్రామిక వేత్త సాయం తో చార్టెడ్ ప్లయిట్ సంపాదించగలిగింది. ఒక్కో నిజం తెలుస్తోన్న కొద్ది తన ఆలోచనల సామ్రాజ్యం కుప్పకూలుతోన్న ఫీలింగ్ కలిగింది.ఈ ప్రపంచం లో డబ్బు,అధికారం ఈ రెండు మాత్రమే కిక్కు ని ఇస్తాయని నమ్మింది ..ఇతరుల కళ్ళ లో ఆనందం కూడా మనకు కిక్కు ని ఇస్తుందని అనిపిస్తోంది.
సమయం ..ఒకే ఒక పదం...అది జీవితాన్ని ఎలా శాసిస్తుందో అర్ధమవుతోంది.గడిచే ప్రతీ క్షణం మనం కోల్పోయే ఆనందమే....అనిపిస్తోంది.కళ్ళ ముందు టార్గెట్ కనిపిస్తింది...కాలం తో పోటీ పడక తప్పదు.అడవి లాంటి ప్రాంతం లో గుర్రం డెక్కల చప్పుడు కు పక్షులు ఎగిరిపోతున్నాయి.ఇది వరలో కలగని ఆనందం ఇప్పుడు కలుగుతుంది మోహన లో...ఒక మంచి పని చేసినప్పుడు కలిగే ఆనందం.
కొన్ని గంటల్లో జరుగబోయే మహా విధ్వంసాన్ని ఆపాలి...అందుకు తన మరణాన్ని ఫణం గా పెట్టినా సరే...
************************
పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానం...శ్రీనివాసుడి నామస్మరణ ఆ ప్రాంగణం లో వినిపిస్తోంది.ఎనభై దాటిన వృద్ధులు అక్కడ సేదతీరుతున్నారు.జీవిత[ఉ చివరి మజిలీలో ఆ దేవుడి దర్శనం...రాష్ట్రపతి చేతుల మీదుగా వేడుకలు...
ఆ వృద్ధులను ప్రత్యెక ద్వారం గుండా తీసుకు వచ్చారు.నడవలేని స్థితిలో వున్నా వారిని వీల్ చైర్ లో తీసుకు వచ్చారు.కొందరు చేతి కర్రల సాయం తో వచ్చారు.అయితే వారి వయసు దృష్ట్యా,రాష్ట్రపతి ఆదేశాలతో పెద్దగా వారిని చెక్ చేయలేదు.ఆ వృద్ధుల సమూహం లో ఖాసిం వున్నాడు.అతని చేతి కర్రలో పదును తేలిన ఖడ్గమూ వుంది.
*******************
కార్తికేయ కారు దిగాడు. కారు వెనుక సీట్లో మహామాన్వి ఖడ్గం వుంది. ఏడుకొండల నుంచి ఒక మెరుపు వచ్చి ఖడ్గం లో విలీనమైన ఫీలింగ్ .అతని పులి కళ్ళు ఆ ప్రాంతాన్ని నిశితం గా పరిశీలిస్తున్నాయి.ఖాసిం ఇక్కడికి వస్తాడన్న పక్కా సమాచారం వుంది.ఎలా వస్తాడు? ఏ వేషం లో వస్తాడు ? శ్రీనివాస్ సత్తార్ ని ఫినిష్ చేసాక కొద్దిగా రిలీఫ్ వుంది.ముగ్ధ జాడ తెలియాలి.
ఖాసిం ని ఫినిష్ చేయగలిగితే..మోహన ను మార్చవచ్చు అన్న నమ్మకం వుంది కార్తికేయకు...
మరో మూడు గంటల్లో రాష్ట్రపతి వస్తాడు.వేద పండితులు,ప్రధాన అర్చకుడు,చైర్మన్ అంతా రాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తున్నారు. బందోబస్తు పకడ్బందీగా వుంది.ఒక్క క్షణం నవ్వొచ్చింది...బాధతో కూడిన నవ్వు...
ఇద్దరు ప్రదానులూ బందోబస్తు వున్నా బలైపోయారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు.
సరిగా కూతవేటు దూరం లో జర్దార్ వున్నాడు ...కార్తికేయ ను వెంబడిస్తూనే వున్నాడు. అతను హిందువు వేషం లో వున్నాడు.
********************
పాడుబడిన భవంతిలోకి ప్రవేశించింది మోహన.అప్పటికే అక్కడ వున్న వంద మంది ఆత్మాహుతి బృందం..సిద్ధం గా వుంది.కరుడుగట్టిన కర్కశత్వం వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది.వాళ్ళ నడుములకు బెల్ట్ బాంబులు ఫిక్స్ చేయబడివున్నాయి. మోహన వాళ్ళ వైపు చూసింది.వాళ్ళ బలహీనత తెలుసు...ఎన్నో సార్లు వాళ్ళను హిప్నటైజ్ చేసి ట్రాన్స్ లోకి తీసుకు వెళ్లి.వాళ్ళతో విద్రోహపూరిత కార్యకలాపాలు కొనసాగించింది.
మోహన అక్కడికి వస్తూనే వాళ్ళ వైపు డ్రగ్స్ విసిరేసింది.రోజుల తరబడి ఆహారం లేకుండా ఆకలితో వుండి ఒకే సారి భోజనం దొరికితే ఎలా వుంటుందో వారి పరిస్థితి అలా వుంది.
అందరూ ఎగబడుతున్నారు.
"స్టాపిట్ "అరిచింది మోహన.అందరూ సైలెంట్ అయ్యారు. మోహన వైపు చూస్తున్నారు.ఆమె స్వరం వారికి చిరపరిచితం.
'మీరంతా నా వైపే చూస్తున్నారు.మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. "మోహన గొంతులో గాంభీర్యం...కమాండింగ్...
"మీరంతా ఫారెస్ట్ లోకి వెళ్తున్నారు.అక్కడ టెంట్ లో వున్నా తీవ్రవాద సంస్థల నాయకులను కలుస్తున్నారు.అక్కడ వున్న నాయకులను అతి దారుణం బెల్ట్ బాంబులతో చంపేస్తున్నారు "
వాళ్లకు సజెషన్స్ ఇస్తుంది.
వాళ్ళు మంత్ర ముగ్దుల్లా వింటున్నారు. వాళ్ళు మోహన ఏది చెబితే అది చేస్తారు.
"కమాన్ స్టార్ట్ యువర్ ఆపరేషన..మూవ్ '" అంది.అంతా యుద్ధ సైనికుల్లా ముందుకు కదిలారు.
మోహన కు తెలుసు.వాళ్ళంతా ఫారెస్ట్ ఏరియా కు బయల్దేరారు ...అక్కడ వున్న తీవ్రవాద సంస్థల నాయకులను ఫినిష్ చేస్తారు.ఒక మంచి పని కోసం ఈ వంద మందిని బలి చేయక తప్పదు.చిన్న వయసు నుంచే వీళ్ళలో కర్కశత్వాన్ని నింపారు.వీళ్ళను మార్చడం సాధ్యం కాదు.ఎప్పటికైనా ప్రమాదకరమే....
తిరుపతిలో జరిగే విధ్వంసాన్ని కళ్ళారా చూడాలని,వచ్చిన ప్రత్యర్ధి దేశాల తీవ్రవాద నాయకులను ఇలా చంపడమే కరెక్ట్.తన లో వచ్చిన ఈ మార్పు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..అంత కన్నా ఆనందాన్నికలిగిస్తుంది.
*************************
అదే భవనం లో వున్న రెండో అంతస్థు లోకి వెళ్ళింది.అక్కడ విద్యారణ్య,డాక్టర్ రాధారాణి,మోహన రూపం లో వున్న ముగ్ధ...వున్నారు.వాళ్ళ చుట్టూ బాంబులు ఫిక్స్ చేయబడివున్నాయి. ఎవరూ కాపలా ఉండకుండా,వాళ్ళు తప్పించుకుపోకుండా ఈ ఏర్పాటు అప్పుడు మోహనే చేసింది. బాంబులు ఎక్కడ వున్నాయో తెలుసు.వాటిని క్షణాల్లో డిస్ కనెక్ట్ చేసింది.
'ఈ క్షణం నుంచి మీరు స్వేచ్చాజీవులు..నా వాళ్ళ మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి.ముగ్ధకు వెంటనే సర్జరీ జరగాలి..మీరు వెళ్ళండి.నరో పది నిమిషాల్లో వెహికల్ వస్తుంది.ఎయిర్ ఫోర్ట్ నుంచి ఢిల్లీ కి వెళ్ళండి.ఆల ది బెస్ట్ ..."వాళ్ళని వదిలేసి అంది.
ముగ్ధ మొదటి సారి తన రూపం లో వున్న మోహన ను చూస్తోంది.తనను తను చూసుకుంటున్నట్టు ఉంది.
స్వతహాగా మనుష్యులను ద్వేషించని ముగ్ధ,మోహన మంచితనాన్ని తనను కాపాడిన రోజు చూసింది.మోహన దగరికి వెళ్లి హత్తుకుంది.
ఒక క్షణ ఆ స్పర్శ తనను తానూ హత్తుకున్న స్పర్శలా అనిపించింది.మనసు పొరల్లో చిన్న ఉద్వేగం...
"మరి మీరు?" డాక్టర్ రాధారాణి అడిగింది.
నవ్వి మౌనం గా ఉండిపోయింది.మోహన చెప్పినట్టుగా వెహికల్ వచ్చింది.వాళ్ళని సాగనంపింది. ఒక విచిత్ర వీడ్కోలు..తనే కిడ్నాప్ చేసి...
ఒంటరిగా మొగిలింది ఆ శిథిల భవనం ముందు మోహన...
ఆమె సెల్ రింగయింది.డాక్టర్ సాకేత్ నుంచి వచ్చిన కాల్...
"ఎక్కడున్నారు ?సర్జరీకి ఎన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి "
"వస్తున్నాను డాకర్ ...ఇప్పుడే నా బాధ్యతలు పూర్తి చేసుకున్నాను " చెప్పింది మోహన.
మరో కొద్ది సేపట్లో దుమ్ము రేపుకుంటూ అక్కడికి వచ్చింది ఓ హెలికాప్టర్ .
మోహన ను తీసుకుని వెళ్ళింది.
అదే సమయం లో రాష్ట్రపతి తిరుమల చేరుకున్నాడు.

No comments: