ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---68 ) (03-04-2013)

వేదమంత్రాల మధ్య దేశ ప్రథమ పౌరుడికి ఘనస్వాగతం లభించింది.శ్రీనివాస్ ఓ వైపు,శ్యాంసన్ మరో వైపు ఎలర్ట్ గా వున్నారు.ఫారెస్ట్ ఏరియా లో వున్న ఉగ్రవాద సంస్థల నాయకులు రాష్ట్రపతి పై జరిగే హత్యాయయ్నాన్ని చూడాలని ఉబలాటపడుతున్నారు. అక్కడక్కడ టెంట్స్...లాప్ టాప్ లో లైవ్ చూస్తున్నారు....తిరుపతి లో పలుచోట్ల జరుగవలిసిన ఆత్మాహుతి దాడులకు సంబంధించిన వార్తలు ఇంకా రాక పోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ పాటికి ఆత్మాహుతి దాడులు జరగాలి.
సరిగ్గా అదే సమయం లో ట్రాన్స్ లో వున్నట్టు వంద మంది ఆత్మాహుతి సభ్యులు నాలుగు వైపుల నుంచి ఆ ప్రాంతాన్ని ముట్టారు.
సడెన్ గా ఆత్మాహుతి దళం తమ ముందు ప్రత్యక్ష్యం కావడం తో ఉగ్రవాద సంస్థల నాయకులు ఖంగు తిన్నారు.ఆత్మాహుతి దళం మొహం లో ఎలాంటి భావాలు కనిపించడం లేదు. యంత్రాల్లా వున్నారు.
వాళ్ళ చేతులు నడుం మీదికి వెళ్ళాయి.
"ఏయ్...ఏం చేస్తున్నారు...మీకు చెప్పిందేమిటి ?మీరు చేస్తున్నది ఏమిటి ?"ఓ ఉగ్రవాద నాయకుడు కోపం గా అడిగాడు.
వాళ్ళు మాట్లాడలేదు.బెల్ట్ బాంబ్ మీద చేయివేసారు ...
"రేయ్ ఖాసిం కు ఫోన్ చేయ్...వీళ్ళని ట్రాన్స్ లోకి తీసుకురావడం వాడి వల్లే అవుతుంది..."ఓ నాయకుడు అరిచి చెప్పాడు..మరొకడు ఖాసిం కు ఫోన్ చేసాడు.అదే వాళ్ళు చేసిన పొరపాటు.
**************************
కార్తికేయ కంట్రోల్ రూం లో వున్నారు.తాత్కాలికం గా ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం..రాష్ట్రపతి దేవుడిని సందర్శించే క్రమం లో కొన్ని సి సి కెమెరా లు రహస్యం గా ఏర్పాటు చేయబడ్డాయి.అన్ని వైపుల నుంచి కవర్ చేస్తున్నాయి ఆ కెమెరాలు.
కార్తికేయ చాలా నిశితంగా గమనిస్తున్నాడు. ఖాసిం ఏ మార్గం లో ఎటాక్ చేయబోతున్నదో అంతుచిక్కడం లేదు.
************************
వృద్ధులను పలకరిస్తున్నాడు రాష్ట్రపతి. వృద్ధుల్లో వున్న నిరాశ,నిస్పృహలను పారద్రోలే పనిలో వున్నాడు.
"వృద్ధాప్యం అంటే మరణానికి ముందు వున్న దశ కాదు...జీవితం లో సాధించలేనివాటిని సాధించే ప్రయత్నం చేయాలి.మీ అనుభవాలు పిల్లలకు తెలియజేయాలి.వృద్ధాప్యం అనివార్యం... అందరికీ వస్తుంది.
యవ్వనం శాశ్వతం అని విర్రవీగకూడదు..."తన మనసులోని మాటలు చెబుతున్నాడు.
అక్కడున్న వృద్ధులకు ఆనందం గా వుంది.ఇలా రాష్ట్రపతి తమతో స్వయం గా మాట్లాడుతాడని అనుకోలేదు.
మరో కాసేపట్లో స్వామివారి దర్శనానికి బయల్దేరుతాడు.అప్పటికే సి బి ఐ చీఫ్ వచ్చాడు.కార్తికేయను ఆప్యాయం గా హత్తుకున్నాడు.నువ్వు ఉన్నావంటే నాకు కొండంత అండ అన్నాడు.కొద్దిసేపటి క్రితం వరకు సిబి ఐ చీఫ్ కు కార్తికేయ ఎవరన్నది తెలియలేదు.సమయం వచ్చింది కాబట్టి కార్తికేయ అసలు విషయం చెప్పాడు.
******************************
తనతో పాటే వృద్ధులకు ప్రత్యేక దర్శనం చేయించాలని నిర్ణయించుకున్నాడు రాష్ట్రపతి. వాళ్ళంతా రాష్ట్రపతి తో కలిసి ప్రత్యేక ద్వారం గుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కార్తికేయ రాష్ట్రపతి ప్రతీ కదలికను గమనిస్తున్నాడు.
ఖాసిం ఆ వృద్ధుల్లోనే వున్నాడు. అతని చేతిలో కర్ర వుంది.అందులో కరవాలం వుంది.రాష్ట్రపాటి కోరిక మేరకు వృద్ధులను పెద్దగా చెక్ చేయలేదు.ఖాసిం కు ఫోన్ వచ్చింది...అది వైబ్రేషన్ మోడ్ లో వుంది...చిన్నగా వులిక్కిపడ్డాడు...ఈ టైం లో ఫోన్ చేసేదెవరు?
సిసి కెమెరాల ద్వారా జాగ్రత్తగా వాచ్ చేస్తోన్న కార్తికేయ ఓ వృద్ధుడి కలవరపాటు గుర్తించాడు.అతని చూపులు గమనించాడు.నేరస్థుడి సైకాలజీ తెలిసిన వ్యక్తి...వెంటనే ఎలర్ట్ అయ్యాడు..తన పక్కనే వున్న మహామాన్వి ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు...బయటకు పరుగెత్తాడు...క్షణకాలం లో జరిగిన సంఘటన...
*******************
ఆపరేషన్ థియేటర్ ....
డాక్టర్ రాధారాణి మొహం లో స్వేదం...అలిసిన కళ్ళు...మోహన గా మారిన ముగ్ధ తిరిగి ముగ్ధ గా మారబోతుంది.మామూలు ఆపరేషన్ కాదు...ఒక మెలోడ్రామా...ఒక అద్భుత అనుభవం...ద్వైదీ భావాలు...
ఇదంతా కలలా వుంది.తమ కిడ్నాప్ ....సర్జరీ...రక్తపాతాలు..బ్రహ్మదేవుడు సైతం రాయలేని లలాట లిఖితం లా అనిపిస్తోంది.
***********************
మోహన కళ్ళు నూసుకుంది.కొద్ది సేపట్లో ఢిల్లీ లో అడుగు పెడుతుంది.విధి ఆడిన విచిత్ర క్రీడ...నిన్నటి తను నేడు ఏమైంది ? నేటి తను రేపెమవుతుంది ? అసలు తనకు రేపు అనేది ఉంటుందా ? పై నుంచి చూస్తె ఢిల్లీ ఒక మినీయేచర్ సెట్ లా కనిపిస్తుంది.
ఆ దేవుడి సృష్టిలో ఈ ప్రపంచం ఒక మినీయేచర్ సెట్..తామంతా చిన్న చిన్న బొమ్మలు...నవ్వొచ్చింది మోహన కు...తనేమిటి ఇలా ఆలోచిస్తుంది ?ఇది వేదాంతమా ? వైరాగ్యమా ? తనకు...తనకు క్యాన్సర్ ..?తనిక బ్రతకదా ?

No comments: