ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---69 ) (04-04-2013)
(ఈ ఉపసంహారం మతోన్మాదాన్ని తెగనరకాలి,దేశద్రోహుల కుత్తుకలు కత్తిరించాలి..అక్షర సంహరణాలు కావాలి . ఒక ఉద్వేగ భరిత ఉపసంహారం...రాత్రి 11-45 కి చీఫ్ ఎడిటర్ విజయార్కె గారి నుంచి ఫోన్...ఉపసంహారం మరింత పదునుగా,మీ విశ్వరూపాన్ని చూపిస్తూ రాయగలరా ?అని అడిగారు. ఉపసంహారం మరోసారి రాయాలా ?అని ఆలోచించలేదు...
రాముడి వాక్కుని లక్ష్మణుడు శిరసా వహిస్తాడు.
నా అక్షరాలకు నడక,నడత స్ఫూర్తి కలిగించిన కలం ఇచ్చిన ఆనతి.
గమ్యం ఒక్కటే...గమనం ఒకటే...లక్ష్యమార్గం అదే...వింటి నుంచి సంధించిన బాణం లక్ష్యాన్ని చేరుకోవాలి,
అక్షరం ఒక అస్త్రం...గమనం ఒక శస్త్రం...అది వెళ్ళే మార్గం అనితర సాధ్యం...
జర్దార్ ప్రాణత్యాగం....ఒక ముస్లిం సోదరుడి అంతర్మథనం...మరో మతోన్మాది దుర్మార్గం...అల్లా,దేవుడు ఒక్కరే...ఈశ్వర అల్లా తేరే నామ్...
ఒక విశ్వమానవ తత్వాన్ని చూపించే మానవతాకోణం...
ఖాసిం ని మహామాన్వి ఖడ్గం శిక్షించిన నేపథ్యం...
కీ బోర్డు మీద అక్షరాలూ నా ముందు తలవంచినా,పదాల మధ్య కొరవడిన భావోద్వేగం...ఒక్క క్షణం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.తొమ్మిది నెలలు మోసిన స్త్రీ మూర్తి ప్రసవ వేదన అనుభవించే సమయాన కలిగే నొప్పి,
ఈ ఉపసంహారం రాస్తోన్నప్పుడు...డెబ్భైరోజులబాధ చివరి క్షణాన మొదలైన పెయిన్....
భగవంతుడా...మా అమ్మ నన్ను కన్నప్పుడు పడిన వేదన ను ఇలా తెలియజేసావా?ఒక స్త్రీ ఔన్నత్యం ఇలా తెలిసి వచ్చేలా చేసావా ?
మూడు గంటలు నన్ను కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉపసంహారం...తెల్లవారు ఝాము 4-30 కి నా నుంచి వీడ్కోలు తీసుకుని మేన్ రోబో ని చేరింది.
తెల్లవారితే ఈ సీరియల్ చదివి మీరు అభినందించే అభినందనల కామెంట్స్....నాకు మీ అభిమానపు క్షీరసాగర మథనం లో లభించిన అమృతమే...
ఈ ఉపసంహారం ఒక మర్చిపోలేని అనుభూతి....మీ విసురజ )
ఉపసంహారం...
మంత్రోచ్చారణల వేద ఘోష ...పరమ పవిత్రమైన తిరుమలేశుడి సన్నిధిలో జరుగబోయే మహా సంగ్రామం...కార్తికేయ చేతిలోని కరవాలం....త్రినేత్రుడి ముక్కంటిగా ,మహా విష్ణువు సుదర్శనచక్రం గా ,విశ్వరూపం దాల్చిన మహోగ్రరూపమై...
ఖాసిం కు అర్ధమైంది...కార్తికేయ ఉగ్రరూపం కళ్ళ ముందు కనిపిస్తోంది.నరసింహావతారమా ...ప్రళయకాల యముడి...ఆగ్రహోదగ్రుడై...వాయువేగాన్ని అధిగమించి,పరుగెత్తుకు వస్తున్నాడు.ఆ వేగాన్ని చూసి మేఘాలు చెల్లాచెదురయ్యాయి.ఉరుములు ఉరిమాయి..పిడుగులు గొంతు విప్పాయి.
ఖాసింకు రాష్ట్రపతి కన్నా ముందు కార్తికేయను చంపితేనే తన ప్రాణాలు నిలుస్తాయని అర్ధమైంది.సెక్యూరిటి ఎలర్ట్ అయ్యేలోగానే సెక్యూరిటీ చేతిలో వున్నా స్టెన్ గన్ తీసుకున్నాడు....ఒక్కసారిగా బుల్లెత్స్ వర్షం కురిపించింది.
అప్పుడే వినిపించింది ఓ గొంతు...ఒళ్ళు గగుర్పొడిచేలా ...గొంతును చీల్చుకుంటూ 'అల్లాహో అక్బర్...ఏ అల్లా.." జర్దార్ మెరుపు వేగం తో కార్తికేయ కు అడ్డు వచ్చాడు...స్టెన్ గన్ లోని బుల్లెట్ల వర్షం జర్దార్ శరీరాన్ని తూట్లు పొడుస్తోంది.."తిరుపతి ప్రాకారాన్ని చూస్తూ..అల్లాని ప్రార్ధిస్తూ అతని కనులు మూ...త...ప...డు..తు..న్నా..యి.
"జర్దార్.."కార్తికేయ జర్దార్ తలను తన ఒళ్లోకి తీసుకున్నాడు .
"దోస్త్...మేరా దోస్త్...నా బిడ్డకు పునర్జన్మను ఇచ్చిన మిత్రమా...ప్రేమ లోని అల్లా తత్వాన్ని చెప్పిన సోదరా...నా మరణం ఒక పశ్చాత్తాపం...అల్లా దగ్గరికి వెళ్తున్నాను...ఏ అల్లా నువ్వు చెప్పిన ప్రేమను.కొందరు మతోన్మాదులు తప్పు దారి పట్టిస్తున్నారు..నువ్వు మంచిలో వున్నావు...ఇతరులకు ప్రేమను పంచడం లో వున్నావు.నీ ప్రేమతత్వాన్ని అర్ధం చేసుకుని బ్రతికే అవకాశం కోసం మరో సారి పుట్టుంచు "అని అల్లా నుకోరుకోవడం కోసం వెళ్తున్నాను.
అదిగో దోస్త్...నీ దేవుడిలోనూ నాకు అల్లా కనబడుతున్నాడు...నీ లోనూ కనిపిస్తున్నాడు...వుంటాను మిత్రమా...నా బిడ్డను నీకు అప్పగిస్తున్నాను.వాడిని కార్తికేయలా చూడాలి.."
జర్దార్ కు శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది.
"మిత్రమా నా కోసం నువ్వు నీ ప్రాణాలు అర్పించావా ?కార్తికేయ కళ్ళలో కన్నీళ్లు .
"కాదు దోస్త్..మంచితనాన్ని బ్రతికించడం కోసం...ఖాసిం లాంటి దేశద్రోహి ని బట్టి మా ముస్లీం సోదరులంతా అలాంటి వాళ్ళే అనుకోవద్దని చెప్పడం కోసం నా ప్రాణాలు ఖర్చు చేసాను. "
"జర్దార్..."అతని చేతిని స్నేహపూర్వకం గా నొక్కాడు కార్తికేయ.
"ఇది కంట తడిపెట్టే సమయం కాదు దోస్త్..ఆ నీచుడిని అంతమొందించు...ఆ దృశ్యాన్ని చూసి హాయి గా కన్ను మోస్తాను "
కార్తికేయ తల ఎత్తాడు...సెక్యూరిటీ తెరుకునేలోపే ఖాసిం రాష్ట్రపతి ని టార్గెట్ చేయాలని అనుకున్నాడు.చేతి కర్రలోనుంచి కరవాలాన్ని తీసాడు.
ఆకాశం మేఘావృతమైంది . ఒక సారిగా మారిన వాతావరణం ...ఖాసిం చేతిలోని కరవాలం గాల్లోకి లేచింది.పోలీసులు తిరుమలను చుట్టుముట్టారు.ఆకాశం లో మెరిసిన మెరుపుకు ఖాసిం చేతిలోని కరవాలం తలుక్కున మెరిసింది.కొద్ది క్షణాల వ్యవధి...స్ప్లిట్ సెకన్...క్షణం లో వెయ్యో వంతు...
కార్తికేయ చేతిలోని మహామాన్వి ఖడ్గం గాలిలోకి లేచింది...గురి చూసి బలం గా విసిరాడు...
వాయుదేవుడు దారి చూపాడు...వరుణుడు హర్షించి,వర్షించాడు...ఏడుకొండలు..గోవింద నామస్మరనతో ఆ మహామాన్వి ఖడ్గానికి దిశానిర్దేశం చేస్తున్నాయి.
కురుక్షేత్రం లోని పర్జన్య శంఖారావం ఆకాశం లో పిడుగుపాటై వినిపిస్తోంది.భక్తులంతా కళ్ళు మూసుకున్నారు...సాక్షాత్తు ఏడుకొండలు కంపించాయి ...పాపనాశనం ఒక్కసారిగా ఉప్పొంగింది...
మహామాన్వి ఖడ్గం ఒకే ఒక వేటుతో ఖాసిం తల ను మొండం నుంచి వేరు చేసింది.ఆ తల ఏడుకొండలు దాటి నేల రాలింది.
జర్దార్ ఆ దృశ్యం చూడడం కోసమే బ్రతికి వున్నట్టు...కన్ను మూసాడు..తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.
ఒక్క సారిగా ఆకాశం వర్షించింది.ఆ వర్శదారలో కార్తికేయ శాంతించాడు.
***********************
ఒక్కసారిగా కలకలం...టీవీ చానెల్స్ లైవ్ లు మొదలుపెట్టాయి.జరిగిన విషయం పూర్తిగా తెలియదు.కేవలం రాష్ట్రపతి ని చంపడానికి పెద్ద కుట్ర జరిగిందని అభివర్ణించారు.ఆ నిజం తెలిసిన వారు చెప్పరు. ఈ కుట్రలో భాగస్వాములు అయిన ప్రతీ ఒక్కరూ చావుతో మూల్యం చెల్లించుకున్నారు.ఈ మహా విధ్వంసానికి కీలకమైన మోహన పశ్చాత్తాపం తో పరిహారం చేసుకుంది.ఒక మాహా విధ్వంసాన్ని ,తను సంధించిన విధ్వంస అస్త్రాన్ని తనే నియంత్రించింది.అందుకు తన ప్రాణాలను ఫణం గా పెట్టింది.మృత్యువుతో పోరాడుతుంది.
*******************
కార్తికేయ స్వయం గా ముందుకు నడిచాడు. రాష్ట్రపతి స్వహస్తాల మీదుగా మహామాన్వి ఖడ్గాన్ని ,రత్నఖచిత వజ్రవైడూర్యాలు పొదిగిన ఖడ్గాన్ని శ్రీనివాసుడి పాదాల చెంత ఉంచారు. ఒక అవతారలక్ష్యం తో సృష్టించబడిన ఆ ఆయుధం తిరిగి ఆ దేవదేవుడి చెంతకు చేరుకుంది.
రాష్ట్రపతి కార్తికేయ ను ప్రేమపూర్వకం గా ఆలింగనం చేసుకున్నాడు.దేశాన్ని మహా విపత్తు నుంచి కాపాడిన
ధీరోదాత్తుడిగా అభివర్ణించారు.
కారికేయ మనసంతా ముగ్ధ మీద వుంది...మోహన గురించి ఆలోచిస్తుంది.సరిగ్గా అప్పుడే హేమంత నుంచి ఫోన్ ...
"అంజలిని మభ్యపెట్టి మోహన తప్పించుకుంది "
కార్తికేయ అలానే ఉండిపోయాడు.మోహన తప్పించుకుండా ?తన నమ్మకాన్ని వమ్ము చేసి...అంటే...?

No comments: