ఆగష్టు1...(టాగ్ లైను.... డేట్ తో డిష్యుం...డిష్యుం)
01-05-2013
(21st Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
తుఫాన్ తర్వాత వుండే ప్రశాంతత...ఇప్పుడు రిలాక్స్ గా అనిపించింది
రాధాచంద్రికకు...ఈ సంతోషాన్ని భర్తతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ
ఆలోచన ఆమెకు గొప్ప ఫీలింగ్ ని స్వంతం చేసింది. విరహం తర్వాత కలయిక ఎంతో
అద్భుతంగా వుంటుంది. వార్డ్ రోబ్ దగ్గరికి వెళ్ళింది...భర్తకు ఇష్టమైన చీర
కట్టుకోవాలనుకుంది...కానీ ఆ టైం..లో భర్త తన కిష్టమైన ఆచ్చాధన గురించి
చెప్పిన విషయం గుర్తొచ్చి ఆమె మొహంలో అరుణోదయం అయింది. వెంటనే
తయారవ్వడానికి స్నానం చెయ్యటానికి బాత్ రూమ్ లోకి వెళ్ళింది. అరగంటలో బాత్
రూం నుంచి బయటకు వచ్చింది. కిచెన్ లోకి దూరింది. భర్తకు ఇష్టమైన స్వీట్
చేసింది. ఎందుకో ఆమెలో కొత్త ఉత్సాహం...ఒక సమస్య కళ్ళ ముందు నుంచి మంత్రం
వేసినట్టు మాయం అవ్వడం వల్ల కావచ్చు. భర్త రాక కోసం
ఎదురుచూస్తుంది...అభిసారికలా....
============
ఊహించని సమస్య...ఒక్క క్షణంలో మాయమైంది...అనుకుంది రాధాచంద్రిక...కానీ ఆ
మరుక్షణమే ఆమె అంచనా తప్పని చెబుతూ ల్యాండ్ ఫోన్ మోగింది. ల్యాండ్ ఫోన్
రింగ్ వినగానే ఒళ్ళు గగుర్పొడిచింది. ఆమె మొహంలో రంగులు
మారుతున్నాయి...మళ్ళీ ఇదేమిటి? ఆ ఫోన్ ఎవరి దగ్గరి నుంచి? ఒక్కో అడుగు
భారంగా వేస్తూ బెడ్ రూం వైపు నడుస్తోంది.
"హలో " అంది రిసీవర్ లిఫ్ట్ చేసి..
"చాలా అందంగా ముస్తాబై మీ వారి రాక కోసం ఎదురుచూస్తున్నారా మేడం? అవతలి వైపు నుంచి వినిపించింది.
ఉలిక్కి పడింది రాధాచంద్రిక..."ఈ విషయం అతనికెలా తెలుసు? "
"ఈ విషయం వీడికెలా తెలిసింది అని ఆశ్చర్య పోతున్నారా? వెరీ సింపుల్
...మీరు నా పీడ విరగడ అయింది అనుకుంటున్నారు... అంత తొందరగా వీలవ్వదు
మేడం...బై ది బై ఓ సారి మీరు డోర్ ఓపెన్ చేస్తే మీకో గిఫ్ట్ కనిపిస్తుంది.
తొందరగా వెళ్లి చూడండి" ఫోన్ కట్ అయింది.
వెంటనే ఫోన్ పెట్టేసి డోర్
దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. నేల మీద ఓ కవర్ ...రెడ్ కలర్ టేప్ తో
అతికించిన కవర్...వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని డోర్ క్లోజ్ చేసి
వణుకుతోన్న చేతులతో కవర్ ఓపెన్ చేసింది.
లోపల ఫోటో....ఒక క్షణం ఆమె
గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. తన గెస్ట్ హౌస్ లో ఉన్నప్పటి
ఫోటో...తనూ, తన చేతిలో పర్స్...డెడ్ బాడీ...క్లోజ్ లో కనిపిస్తోన్న దృశ్యం.
రాధాచంద్రిక భయంతో కంపించిపోయింది. అలానే సోఫాలో కూలబడిపోయింది. మళ్ళీ
ఫోన్ ...మోగుతూనే వుంది. ఒక నిమిషం గ్యాప్ తర్వాత మళ్ళీ మోగింది...తల
వెనక్కి వాల్చి అలానే వుండి పోయింది. ఈ సారి ఆమె సెల్ రింగయింది...డిస్
ప్లే లో భర్త పేరు...ఈ ఫోన్ కాల్ కాసేపటి క్రిందట వచ్చి వుంటే తనెంతో
సంతోషించేది.
సెల్, లాండ్ ఫోన్ ఒకే సారి రింగయ్యాయి...ల్యాండ్ ఫోన్
అంటే బ్లాక్ మెయిలరే అయి ఉంటాడు. నీరసంగా లేచింది...బెడ్ రూంలోకి నడిచింది.
రిసీవర్ లిఫ్ట్ చేసి "హలో అంది "
"మిమ్మల్నిపదే పదే డిస్ట్రబ్
చేస్తున్నందుకు సారీ మేడం...ఏం చేస్తాం నా వృత్తి అలాంటిది మరి ...అన్నట్టు
ఫోటోఎలా వుంది మేడం...క్లారిటీ మిస్సవ్వలేదు కదా ...మంచి మెగా ఫిక్సర్
...మీరు చాలా అందంగా వున్నారు "
"అసలు ఏమిటిదంతా ..." కోపంగా అడిగింది రాధాచంద్రిక.
"బ్లాక్ మెయిలింగ్ ..మీ వారు చేసిన హత్యకు నేను ప్రత్యక్ష్య సాక్షిని...కంటితో చూసిన ఐ విట్నెస్ ని.."
"అబద్ధం నా భర్త అలాంటి వాడు కాదు..." అరిచింది ఫోన్ లోనే .
"వెరీ గుడ్ ఈ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది..మీరన్నట్టుగా మీ భర్త ఆ
అమ్మాయిని చంపలేదు...మరెవరు చంపినట్టు...మీరా ? ఒక్కో అక్షరం నొక్కి
పలుకుతూ అడిగాడు.
తన వెనుక ఏదో జరుగుతుందని అర్థమైంది. "ఓకే
..మేడం...బాగా ఆలోచించుకోండి ..నో ప్రాబ్లం...ఈ ఫోటో కాపీని ఏ పోలీస్
స్టేషన్ కు పంపమన్నా పంపిస్తాను, నాకు తెలుసు మీ వారు ఆ హత్య చేయలేదని ...
కానీ ఆ విషయం పోలీసులు ఎలా నమ్ముతారు ... ఆ హత్య చేస్తే మీరు చేయాలి
...లేదా మీ వారు చేయాలి. పాపం మీరంటే పిచ్చి ప్రేమ మీ కోసం చచ్చేంత ప్రేమ
... " అవతలి వైపు నుంచి వినిపించింది.
"ఇప్పుడు నన్నేం చేయమంటారు? అడిగింది.
"గుడ్ ...ఏం చేయాలో తర్వాత చెబుతాను..ప్రస్తుతానికి బై"
తల పట్టుకుని కూచుంది రాధాచంద్రిక. అ క్షణం నుంచి ఆమెకు మనశ్శాంతి
మిస్సయింది, తనకు ఏం జరిగినా పర్వాలేదు. తన భర్తకు ఏమీ కాకూడదు. ఆ క్షణం
నుంచి భర్తను మరింతగా ప్రేమించడం మొదలు పెట్టింది.
గతం నుంచి వర్తమానానికి వచ్చింది.
=============
సంధ్యాజ్యోతికి ఆ రోజు చిటచిటగా వుంది. అరచేతికి చెమట పట్టింది. "ఒసే
సంధ్యా, నువ్విలా కామ్ గా వుంటే మూకీ సినిమాలా వుంది. ఏదో ఒకటి చేసేయవే..."
అంతరాత్మ రెచ్చగొడుతుంది. అవును తన కారెక్టర్ కు సైలెంట్ అస్సలు మ్యాచ్
అవ్వదు. ఏదో ఒకటి చేయాలి. అలా ఆలోచన రాగానే లేచింది...సబ్ ఎడిటర్ శర్మ ఆమె
వంకే చూస్తున్నాడు.
సంధ్యాజ్యోతి బయటకు వచ్చి క్యాబ్ ని పిలిచి అందులో
కూర్చుని అడ్రెస్ చెప్పింది. అది చేతబడులు చేసే ఓ క్షుద్ర మాంత్రికుడి
చిరునామా...
(ఈ సస్పెన్స్ రేపటి సంచిక వరకూ)
No comments:
Post a Comment