1) ఏ విషయం
పైనైన చర్చ చేయాలి గాని ఆ చర్చను రచ్చ రచ్చ చెయ్యకూడదు. అలాగే ఏదైనా
విషయంపై వాదన చెయ్యాలంటే విషయ పరిజ్ఞానం, పట్టు వుంటే సరిపోదు, చెప్పే
నేర్పు, వ్యవహార తీరు, ఆకట్టుకునే శైలి వుండాలి. ఎప్పుడూ 'చర్చ' జరిపితే
ఏది కరెక్ట్ అనేదే తేలుతుంది మరదే 'వాదన' జరిపేది మటుకు ఎవరు కరెక్ట్
అన్నది తేల్చడానికి. కనుక జీవనానికి ఏది హితమో తెలుసుకుని మెలగండి.
2) భావాజాల కావిళ్ళ బరువు మోస్తూ బ్రతుకు యాత్ర సలపరాదు. భావజాలమనేది మనిషికి మార్గదర్శకుముగా నిలిచి మానవుని నైజంకు మెరుగు పెట్టాలి కానీ తన గుప్పెట్లో ఖైదు చేసుకునరాదు. తర్కం, విచక్షణ, ఆత్మవలోకన చేసుకుంటూ మనిషి జీవనం ప్రగతిపధంలో ముందడుగు వేయాలి..
(P.S. ..... జడుపు, జడత్వం వదిలేస్తే జయం నీదేగా)

No comments:
Post a Comment