ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

1) కదిలే కాలం, వీచే గాలి, కొట్టుకునే గుండె, పూచే తరువు ఒక్క క్షణం ఆగినచో, తమ గతి మార్చినచో ఉపద్రవాలు జరిగిపోవు. అందుకే ఎవరి కార్యాన్ని వారు చక్క నిర్వర్తించాలి, నిర్వర్తించనివ్వాలి.

2) జరుగుతున్నవన్ని మన మంచికే అన్న భావనను మాయని వస్త్రంగా ధరిస్తే మానసంలో పీడా, బాధా వీచికలు పొడ సూపవు.. మనసు ఆహ్లాదభరితంగా వుంటుంది.
(PS...చెడు తలపులను విసర్జించు..ఆనందంగా జీవించు)

No comments: