ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1(టాగ్ లైను ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
23-05-2013 (Chapter-43)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
ఆకలి...
కేవలం మూడక్షరాల పదం...అది మనలోనే ఉంటూ, మనల్ని తన మాటలతో కాకుండా చేతలతో బాధ పట్టే బూచి, ప్రణవికి ఆకలి వేస్తోంది...ట్రైన్ లో జర్నీ...నిలబడి ప్రయాణం..గమ్యం తెలియని అయోమయం...తానెవరో తెలుసుకోవాలన్న తాపత్రయం...తనకు మతిమరుపా? అల్జీమర్స్?
మరుపు అనే గొప్ప వరాన్ని ఇచ్చిన దేవుడు ఆకలిని మర్చిపోయే వరం ఎందుకు ఇవ్వలేదు...ప్రేమించిన మనిషి కోసం తాపత్రయపడే మనసు అనే కనిపించని పదాన్ని ఇచ్చిన దేవుడు ఆ మనసులో ఎవరున్నారో తెలుసుకునే శక్తి ఎందుకు ఇవ్వలేదు....
తన దేవుడుని చేరుకోవడానికి హెల్ప్ చేయ గల ఏ దేవుడూ భువికి దిగి రాడా?ఈ భువిలో ఆ దేవుడే లేడా?
******************
కార్తికేయ నార్త్ వింగ్ రోడ్ మీదికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అతనిలో ఆందోళన, ఎవరో ప్రమాదంలో ఉన్నారన్న హెచ్చరిక అతని సిక్ష్త్ సెన్స్ ని చేరింది.
***************
వేసవి జులుం విదిలించింది. కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ ...ఇక్కడ తనకు తెలిసిన వారు ఎవరైనా కనిపిస్తే బావుండు అనుకుంది. హ్యాండ్ బాగ్ ఓపెన్ చేసింది. అందులో చిల్లర తప్ప ఏమీ లేదు.
ఎదురుగా నలుగురు అపరిచితులు కనిపించారు. వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ మొహాలు తనకు తెలిసిన మొహాలు.
వాళ్ళని వెళ్ళి పలకరిస్తే? ప్రణవి ముందుకు నడిచింది. వాళ్ళ చేతుల్లో ఫోటోలు వున్నాయి. అవి ప్రణవి ఫోటోలు.
***************
ఎండ మొహాన్ని తాకుతోంది. హ్యాండ్ బాగ్ లో నుంచి స్కార్ప్ తీసి మొహానికి కట్టుకుంది. ఆ నలుగురు ఆగంతకులను చేరేలోపు వాళ్ళు మరో పక్కకి వెళ్లారు. ఆ పక్కనే పుస్తకాల షాప్ వుంది. వరుసగా పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్స్ వేలాడదీశారు. వాటిలో చాలా వాటిలో
ప్రణవి తాలుకూ ప్రకటన వుంది. ఫుట్ పాత్ పక్కగా నడుస్తోంది. కాలు స్లిప్పయింది. కింద పడబోయింది. అ పక్కన పాత పుస్తకాలు అమ్ముతున్నారు. ఆ పుస్తకాల దొంతర మీద పడింది. ఆమె తల పుస్తకాల మీద పడడం వల్ల తలకు దెబ్బ తగలలేదు. అవుట్ లుక్ పాత సంచికలు. అందులో చంద్రహాస్ కవర్ పేజితో వచ్చిన బుక్ వుంది. ఆ పుస్తకం మీదే ప్రణవి తల తగిలి సేఫ్ అయింది.
చిన్న గగుర్పాటు...పుస్తకాల షాప్ ఆతను కంగారుపడి "దెబ్బ తగిలిందా మేడం? అని అడిగాడు.
ప్రణవి మాత్రం చంద్రహాస్ ఫోటో వంకే చూస్తోంది. ఆ రోజు జరిగిన రెండు సంఘటనలు ప్రణవి గతానికి దగ్గరగా వున్నవే...
ఆ నల్గురు ఆగంతకులు ప్రణవి కోసం వెతుకుతున్న మాఫియా మనుష్యులు...ఒకప్పుడు వాళ్ళ దగ్గరి నుంచే తప్పించుకుంది అన్న విషయం ప్రణవికి గుర్తు లేదు. యాద్రిచ్చికంగా భర్త ఫోటో చూసింది...కానీ అతనెవరో గుర్తు పట్టలేకపోయింది.

(1985 ప్రాంతంలో డెన్మార్క్ లో జరిగిన సంఘటన...యాక్సిడెంట్లో మతిస్థిమితం కోల్పోయిన మియెన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా తానెవరో తెలుసుకోవాలని ప్రయత్నించిందిట...ఆమెను కాపాడిన పెద్ద మనిషి ఆ మహిళను తనతో పాటు తీసుకు వెళ్ళి కన్న కూతురిలా చూసుకున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత తిరిగి డెన్మార్క్ లో అడుగు పెట్టింది. తండ్రిలా చూసుకున్న పెద్ద మనిషి వ్యాపారాలు చూసుకుంటూ అందులో భాగంగా ఓ మీటింగ్ అటెండ్ కావడానికి కారులో బయల్దేరింది. వేగంగా వస్తోన్న కారును గుద్దేసింది. ఎవరికీ ప్రాణాపాయం కలుగలేదు. కానీ అవతలి కారులో వున్న వ్యక్తి కోపంగా వచ్చాడు. అతను ఆ రోజే పెళ్లి చేసుకోవడానికి చర్చికి బయల్దేరాడు. మియెన్, సారీ చెబుతూ, ఆ వ్యక్తిని చూసింది. అతనూ చూసాడు. మియెన్ డార్లింగ్ ..నువ్వు బ్రతికే వున్నవా? నీ కోసం ఇన్నాళ్ళు చూసి ఈ రోజే మన సెక్రటరీని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అంటూ సిగ్గు పడుతూ చెప్పాడు. ఆ తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. అలా యాక్సిడెంట్లో మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకున్నారు- రచయిత)
************
వైజాగ్...
చంద్రహాస్ ఎప్పుడూ లేనంత ఉద్వేగానికి గురయ్యాడు. సంధ్యాజ్యోతి ఫోన్ చేసి చెప్పింది. తను ప్రణవిని చూసింది..ట, అంటే తన ప్రణవి ముంబాయిలోనే ఉందా ? తను వెంటనే వెళ్లిపోవాలి. తన ప్రణవి ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి.
అతని ఆలోచనలు ఆశ్వవేగాన్ని మించి వెళ్తున్నాయి. కానే అతని వెనుక భయంకరమైన కుట్ర జరుగుతుందన్న విషయం అతని తెలియదు.
అతడిని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం ...ఒక బిజినెస్ టైకూన్ ని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం.
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

No comments: