ఆగష్టు1 (టాగ్ లైను ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
24-05-2013 (Chapter-44)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
మాఫియా మరణమృదంగం మొదలైంది. స్టీఫెన్ మాఫియా లింక్స్ ని కదిలించాడు. వ్యాపారంలోనే కాదు వ్యక్తిత్వంలోనూ అతనికి మోరల్ వాల్యూస్ లేవు. అతని టార్గెట్ చంద్రహాస్ పతనం...మనిషి జీవితకాలం స్వల్పమే అని తెలిసినా, అల్పత్వాన్ని ప్రదర్శించే వైఖరి. కొన్ని వందల కోట్లు అతని పేర, హవాలా మార్గంలో, స్విస్ బ్యాంక్స్ లో కోమాలో వున్నట్టు వుంది. వందేళ్ళ జీవితంలో వందేళ్ళ బ్రతుకు గ్యారంటీ లేని ఆయుష్షు...అయినా వంద తరాలకు సరిపడా సంపద వున్నా, తాపత్రయం...
క్షణాల్లో మాఫియా వైజాగ్ ను చుట్టుముట్టింది. చతుర్వేది నుంచి చంద్రహాస్ కు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నా వెంటనే బయల్దేరి వచ్చేయమని. ఎయిర్ పోర్ట్ ని చేరుకున్న చంద్రహాస్ కు అనుమానం వచ్చింది. ఎవరో తనని వెంబడిస్తున్నారు. వ్యాపార ప్రపంచంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కున్నాడు. అతనికి మాఫియా కదలికలు తెలుసు. మాఫియా ఎప్పుడెలా రియాక్ట్ అవుతుందో తెలుసు. ఒక సారి సుపారీ తీసుకుంటే ఎదుటి వ్యక్తిని ఎలా ఫినిష్ చేయాలో తెలుసు.
"డి "గ్రూప్ విధ్వంసాన్ని స్వయంగా చూసాడు బాలీవుడ్ ని, క్రికెట్ నీ వదిలిపెట్టలేదు. అలాంటి మాఫియా తనని టార్గెట్ చేసిందని తెలుసు...ప్లయిట్ అనౌన్స్ అవుతోంది. నలుపు చొక్కాల మీద చిన్న డిజైన్ ...ఆ గుర్తు తనకు తెలుసు....వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు అర్ధమైంది...తనని జల్లెడ పట్టడానికి మాఫియా మొత్తం రంగంలోకి దిగిందని.
*******************
వెనక్కి వెళ్ళిన నలుగు ఆగంతకులు డేగ కళ్ళతో వెతుకుతున్నారు. వాళ్లకి ప్రణవి ఢిల్లీ లో ఉందన్న సమాచారం వచ్చింది. తమ దగ్గరి నుంచే తప్పించుకుంది. ఈ సారి దొరికితే ఫినిష్ చేయాలన్నత కోపంగా వున్నారు. వాళ్ళ చేతుల్లో తల్వార్లు మెరిసిపోతున్నాయి. వాటి పదును వెంట్రుకను రెండుగా చీల్చేలా వుంది.
సుమో ముందు ఆగారు. సుమోలోకి ఎక్కి కూచున్నారు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ, మిర్రర్ లో చూసారు....
**********************
కింద పడిన మేగజైన్ చేతిలోకి తీసుకుని చంద్రహాస్ ఫోటోని చూస్తూ వుండగా...గాలికి ఆమె స్కార్ప్ తొలిగింది. చల్లగాలి ఒక్క క్షణం ఆమె మొహాన్ని స్పృశించింది. అప్పుడే సుమోలో వున్న ఆగంతకులు మిర్రర్ లో ప్రణవిని చూసారు. వెంటనే కిందికి దిగారు. వెనక్కి పరుగెత్తారు.
ప్రణవి స్కార్ప్ ని సరిచేసుకుని మేగజైన్ ని షాప్ అతనికి ఇచ్చి రెండు అడుగులు ముందుకు వేసి ఆగిపోయింది. తన ఎదురుగా వున్న ఆగంతకులను చూసి. ఆమె మనసు కీడుని శంకించింది. రెండు అడుగులు వెనక్కి వేసింది.
తనను ఎందుకు వెంబడిస్తున్నారో అర్ధం కాలేదు ప్రణవికి...పోనీ వాళ్ళనే అడిగితే...వాళ్ళ చేతిలో వున్న ఆయుధాలు చూస్తోంటే హంతకుల్లా వున్నారు. ముందు తను ఇక్కడి ఉంచి పారిపోవాలి. అలా మొదలైంది...ప్రాణాలతో పరుగు పందెం.
****************
ఆయాసంతో రొప్పుతుంది. ఎందుకు వెంబడిస్తున్నారో తెలియడం లేదు. తనకూ వాళ్ళకూ మధ్య శత్రుత్వం ఏమిటి? తానిప్పుడు ఎంత దూరం పరుగెత్తాలి? ఒక మూల మలుపు దగ్గర ఆగింది...దాహం...గొంతు తడారిపోతుంది. అక్కడ తలదాచుకుంటే? రోప్పుతూనే ఆలోచిస్తోంది ...ఒక క్షణం కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతూ కళ్ళు తెరిచి చూసింది. ఆ నలుగురు ఆగంతకులు తన ఎదురుగా...
అయిపొయింది...వాళ్ళు తనని చంపేస్తారు...చచ్చిపోతానన్న భయం కన్నా, తానెవరో తెలుసుకోకుండా చచ్చిపోతాను...అన్న ఫీలింగ్ ఎక్కువైంది.
దేవుడా నన్ను కాపాడు...నా కోసం కదిలిరా...కళ్ళుమూసుకుని దేవుడిని వేడుకుంది. కళ్ళు తెరిచింది. అగంతకులకు, తనకు మధ్య ఒక మెరుపు, ఒక విశ్వరూపం...ఒక తేజస్సులా...కార్తికేయ.
అతని చేతిలో రివాల్వర్ ఆగంతకుల వైపు గురి పెట్టబడి వుంది.
**********************
( సీక్వెల్స్ లోనూ, అపరాధ పరిశోధన నవలలోనో కనిపించే అద్భత ప్రయోగం..కార్తికేయ ఆగమనం వెనుక నేపథ్యం రేపటి సంచికలో, రచయిత విసురజ ఎక్స్ క్లూజివ్ ---చీఫ్ ఎడిటర్)

No comments:
Post a Comment