ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 26 June 2013

 దీక్షిత రామాయణం

(3వ భాగం)

************

Photo: దీక్షిత రామాయణం  ... దీక్షిత విరచిత రామాయణం ఆ శ్రీరామునికే అర్పణం అదే శ్రీరామార్పణం.

(17-06-2013)

                                           శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

(ప్రముఖ రచయిత విసురజ సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో...)

                         (3వ భాగం)

                            ************

అదెలాగంటే.. కన్నీటితో తనను ఉద్ధరించాలని కోరిన ఆ పతితుడ్నిమంచివాడిగా మార్చాలని నిశ్చయించారు. తమ అద్వితీయ తపోశక్తిని వారు ఈశ్వర నామంతో రంగరించారు. ఆ దివ్య పెన్నిధిని అతడికి రహస్య మంత్రంగా ఉపదేశించారు. ఆ మంత్రాన్ని మననం చేసుకోగానే అతడి మనస్సు శాంతమైనది. అంతరంగం పరిశుద్ధమైనది.

ఋషుల మాట మేరకు అతడు ఆ మంత్రాన్ని జపిస్తూ అలా.. ధ్యానంలోకి జారిపోయాడు.భావి సమాజాన్ని ఉద్ధరించగల ఒక మహాయోగిని తీర్చిదిద్దిన సంతృప్తితో ఆ సప్తర్షులు నిర్వికారులై, నిష్కాములై సాగిపోయారు..అదే మునుల గొప్పతనం. తమకంటూ ఏ కోరికలూ లేకుండా, లోక కళ్యాణమే ధ్యేయంగా వారు తపస్సు చేస్తారు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన పుణ్యాన్ని, శక్తిని ఇలా ఇతరులను తరింపజేసే క్రమంలో నిస్సంకోచంగా ధారవోస్తారు. ఈషన్మాత్రం కూడా లోభత్వం లేని దాతృత్వం వారిది. అందుకే ఋషులకు మనం సదా రుణపడి ఉండాలి. అనుదినం అనుక్షణం వారు నిర్దేశించిన మార్గంలో నడవాలి, ధర్మాల్ని పాటించాలి. అదే ఋషి ఋణం తీర్చుకునే ఏకైక మార్గం.

ఇక ఇక్కడ.. అరణ్యంలో అతడి తపస్సు సాగుతూనే ఉంది. నిర్నిరోధంగా, నిరంతరంగా..ఎన్ని వసంతాలు, వర్షాలు గడిచిపోయాయో లెక్కలేదు. ఈశ్వర నామామృతాన్ని గ్రోలుతూ... ఆ దివ్య వైభవాన్ని ఆస్వాదిస్తూ.. అలౌకిక అద్వితీయ అమరానంద స్థితిలో అతడు అలాగే ఉండిపోయాడు. బాహ్య స్పృహ అతడికి పూర్తిగా నశించింది. కాల క్రమంలో ఆ అరణ్యం పలు మార్పులకు లోనైంది. కానీ అతడు కదలనే లేదు. ఆతడి శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. తన దేహం పిపీలకాది సూక్ష్మ జీవులకు, క్రిములకు ఆహారంగా మారి కృశించింది. ఇంత జరిగినా అతడి మనసు దైవధ్యాస నుంచి మరలలేదు. అతడి నోటి వెంట హరనామ స్మరణ ఆగలేదు...కాలం నడక ఇలా సాగుతుండగా.. అక్కడ సత్యలోకంలో ఒక విశేషం జరిగింది..

ఒకనాడు నారదుల వారికి విధాత శ్రీమన్నారాయణుని నరావతార గాధను వివరించాడు. అదే శ్రీరామ కథ. ఆ కథను విన్నంతనే నారదుని హృదయం పులకించింది. కన్నుల వెంట అశ్రుధార జాలువారింది. హరి వైభవం సమస్తం కట్టెదుట నిలిచింది. అమృతోపమానమైన ఆ రామకథను నెమరు వేసుకుంటూ నారదుడు దివి నుంచి భువికి దిగి వచ్చాడు. ఇక్కడ సప్తర్షుల ఉపదేశం మేరకు అతడు తపస్సు చేస్తున్న అరణ్య ప్రాంతం మీదుగానే నారదుడి పయనం సాగుతోంది...ఆ పరిసరాలకు చేరువ కాగానే నారదుని హృదయం ఆనందార్ణవమైంది. రామకథా సుధ అతడ్ని వివశుడ్ని చేసింది..ఆ దివ్య గుణ విభూతులను తలచి తలచి మది పరవశించింది. ఎలుగెత్తి ఆ రామకథను గానం చేయాలన్న కోరిక నారదుని ఆవహించింది...కానీ విధాత తనకీ కథ చెప్పే ముందు ఇచ్చిన ఆనతి గుర్తొచ్చింది.. "నారదా ! ఇది దేవ రహస్యం సుమా.... ఎవరికీ ఈ కథను చెప్పవద్దు.." అంటూ బ్రహ్మ చెప్పిన ఆ మాట స్ఫురణకు రావడంతో నారదుడికి నిరుత్సాహం కలిగింది.. ఇంత గొప్ప విష్ణు వైభవాన్ని అందరికీ చాటకుండా ఈ చిన్న మదిలో దాచడమా.. ఎలా? అంటూ పరితపించాడు. అది అసంభవమని భావించాడు. ఇక రామానంద వివశుడైన ఆ నారదుడు రామకథను వినిపించడం ప్రారంభించాడు. దీనికి ముందు అతడు చుట్టూ దీక్షతో పరికించి ఎవరూ లేరని ఖాయపర్చుకున్నాడు. తదుపరి చుట్టూ ఉన్న తరూలతలనే శ్రోతలుగా ఎంచి ఎలుగెత్తి  రామకథా గానం ప్రారంభించాడు.

(రమణీయం,కమనీయం, పరమ పావన రామాయణం.. చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి...ఇంకా వుంది)

*ఈ ధారావాహిక పై మీ స్పందన, మాకు తెలియజేయండి ---మా మెయిల్ ఐడి .............

manrobocreations@gmail.com

No comments: