ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

కవిత: సొబగు హంగులు
...
పడుచు సొగసుకాంతలకు కరుకు మనసిచ్చావు
రోజాపూల కాడలకు గుచ్చుకునే ముళ్ళిచ్చావు

వెలుతురయ్యకు సందేళ చీకటి దుప్పటి కప్పుతావు
చందరయ్యకు చీకటేళ చుక్కమ్మల సరసన పక్కేస్తావు

కదిలిపోయే మబ్బమ్మలకు సప్తవర్ణాల చీరపెట్టావు
వీచిపోయే పవనమ్మకు హాయినిచ్చే గుణానిచ్చావు

పలకరించే పరువాలకు మురిసిపోయే సోకు కాంతులిచ్చావు
వర్షించే చినుకమ్మకు మెరిసే మెరుపులను తోడుగంపేవు

వలపు విరిసిన సింగారికి బుగ్గన సిగ్గుసొట్టెట్టావు
తలపు తడిమిన వయ్యారికి కళ్ళకు ఎరుపుమెరుపిచ్చావు

No comments: