ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

అనురాగదేవతవై నన్నే అలరించవా
అభిసారకవై నీతోడుకై నిరీక్షించవా
నిలువెల్లా తమకంతో నినుచేరి తడిపెయ్యనా
వెల్లువలా వలపువరదై నినుచేరి చుట్టేయ్యనా
మనసుపూలు నీకై విచ్చి పరిమిళించే
ఎదవాకిళ్ళు నీకై వేచి కళ్ళుకాయలుకాచే
తలపుతేనే మధురిమలు మత్తిచ్చే
వలపుమల్లె ఘుమఘుమలు మూడిచ్చే

No comments: