1) కాటుక కళ్ళతో చుట్టేసావు, కట్టేసావు.. చెలి
చూపుల తాళంతో నా గుండెతలుపు తీసావా..
2) నీ మేనికాంతికి ఈర్ష్యపడి...చెలి..
నీలిమబ్బులరగ్గు కప్పుకొని దాక్కునే ..రవి.
3) నల్లమబ్బే నింగినుంచి దిగొచ్చేగా
నేలనున్న నా నెచ్చెలి పాలబుగ్గకి సిగ్గు చుక్కవ్వ
4) నీ పరిమళాలు అప్పిచ్చావా..చెలి.
పూలు కూడా నీలాగే గుభాళిస్తూన్నాయి..
5) అధరాలు చేసిన మధుర యుద్దంలో
వలపు శంఖం పూరించే స్వేదం రసాస్వాధన చెందే
6) చెలి సోకు పరిమళం తెచ్చిందా ఈ గాలి మత్తుగా
కర్పూర చందన పుప్పొడి సౌరభాలు ఎదను తాకాయి గమ్మత్తుగా
7) తెరలు తెరలుగా నవ్వొచ్చే లవ్వొచ్చే
కాదన్నా తరలోచ్చే నీ ఆలోచనల భావవాహిని చూడ
8)వలపు ధారలలో సంపూర్తిగా తడసా
మరలా బ్రతుకులో ఆనందంగా జీవించడం తెలిసా

No comments:
Post a Comment