ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 29 July 2013

1) జీవన స్రవంతిలో ఎందఱో కలవవచ్చు, ఎన్నెన్నో సంగతులు పంచుకోవచ్చు, కానీ నిన్ను వెన్నాడి మనస్ఫూర్తిగా అభిమానించే, ఆరాధించే ఆర్ధ్రతను గొప్పకో, బేషజానికో, మరెందుకైన దూరంచేసుకోకు..జన్మంతా వ్యధలో వృధావ్వే.
2) అందరు ఈ లోకంలో ఒక్కలా వుండరు, అలాగే తప్పు చేయని వాడు, లోపాలు లేనివాడు వుండడు..జరిగిన విషయ్యాన్ని తప్పుగా ఎంచే దృక్కోణాన్ని, చూస్తున్న పరిస్థితిని మార్చి చూస్తే అదే తప్పు మరోలా అగుపించు.. మనసునెరిగి చూడు, విషయవివరణ తప్పక జరుగుతుంది.
(PS...మంచిని ఎంచు, మంచి పెంచు, పోషించు)

No comments: