ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 11 September 2013

1) నమ్మకంతో ఏ పనినైనా మొదలెట్టాలి. అంకితభావంతో సదరు పనిని నిర్వర్తించాలి. అప్పుడు శ్రమతో దక్కిన నీ విజయం ముందు ఎంచుకున్న లక్ష్యం తలవంచు.

2) పారే నీరు ఎంతో చల్లగా, శాంతంగా, మృదువుగా సాగుతుంది.. అదే పోటేత్తితే పెద్ద పెద్ద బండలను, భవనాలను తుడిచిపెట్టుకుపోతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా వుంటే జీవనం సౌఖ్యమే అదే అశాంతిగా వుంటే బ్రతుకు నరకమే.
 


(PS...కరకు మాటైనా ఫరవాలేదు గాని ఇరుకు మనసున్న మనిషితో ఎప్పుడు ఇమడకు)

No comments: