
కవిత కీర్తనం: భారతంలో పంద్రాగష్ట్
..............................................
ఇండియన్స్ కు పంద్రాగష్టంటే......
భరతమాత పరదాస్య విమోచన దినం
భారత్ నుంచి సింధునది దూరమైన వైనం
అర్ధరాత్రి అందిన స్వపరిపాలన స్వతంత్రం
వీరులు చేసిన బలిదానాల సంస్మరణం
భరతమాత త్యాగధనుల్ని కొలిచే దినం
భరతమాతను రెండుగా చీల్చిన వైనం
సోదర జనాలే కత్తులు దూసిన వైనం
రాత్రికిరాత్రే జనం కాందశీకులైన వైనం
ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి ప్రసంగం
పిల్లాపెద్దలచే మువ్వన్నెల జెం వందనం
స్కూళ్ళలో పిల్లలకి చాక్లెట్ల పంపకం
సమతా మమతా జాతీయతల సమ్మేళనం
లోకంలో భారతీయులకు పండుగ దినం
...........
విసురజ
No comments:
Post a Comment