
కవిత: విన్నపం
..................
కళ్ళార్పకే కాంతి మాయమయ్యే
మోము తిప్పకే మధ్యాహ్నం సాయంత్రమయ్యే
నవ్వుతూనే లవ్వులో దించావే
కళ్ళతోనే బోలెడన్నీ కబుర్లు చెప్పావే
నీవు మెచ్చి నను పిలవా
వేనవేల వీణలు మదిలో మారుమ్రోగే
నీవు వలచి దరిచేరగా
ఎదలో వలపు సంగీతగానం వినవచ్చే
ప్రేమ ప్రేమదేవతవి నీవే
ధైవం దేవాలయం నీవున్న హ్రుదయమే
నీవే తోడుంటే మనసురాణి
చెలి నాకేంటి లోకంతో నాకింక పనేమిటి
.........
విసురజ
No comments:
Post a Comment