ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

 Photo: కవిత: ఏమైతే-ఏమిటవ్వే 
............................
నింగి నువ్వైతే 
నిత్యంవెలిగే నెలరాజు నేనౌతా 
చిరుజల్లు నువ్వైతే 
చిందేసే చినుకు నేనౌతా 
విరిబాల నీవైతే 
విరిసిన విరిసుగంధం నేనౌతా 
కడలి నీవైతే 
కెరటాల చేరేతీరం నేనౌతా 
తనువు నీవైతే 
తమకాల సుమధనువు నేనౌతా 
కనులు నీవైతే 
కరగని అనురాగచూపు నేనౌతా 
మోము నీవైతే 
మెరిసే లలాటలిఖితం నేనౌతా 
స్వరం నీవైతే 
సరాగాల రాగశరం నేనౌతా 
స్వర్గం నీవైతే 
సంతోషాల తూలికతల్పం నేనౌతా 
హృదయం నీవైతే 
హత్తుకునే ప్రేమమత్తు నేనౌతా 
కష్టం నీవైతే 
కాష్టంలోను వీడనిబంధం నేనౌతా
ఎద నీవైతే 
ఎడదలో సవ్వడి నేనౌతా 
వలపు నీవైతే 
వీడలేని మోహావేశం నేనౌతా 
భామినివి నీవైతే
భద్రతిచ్చే బావని నేనౌతా 
................. 
విసురజ

కవిత: ఏమైతే-ఏమిటవ్వే
............................
నింగి నువ్వైతే
నిత్యంవెలిగే నెలరాజు నేనౌతా
చిరుజల్లు నువ్వైతే
చిందేసే చినుకు నేనౌతా
విరిబాల నీవైతే
విరిసిన విరిసుగంధం నేనౌతా
కడలి నీవైతే
కెరటాల చేరేతీరం నేనౌతా
తనువు నీవైతే
తమకాల సుమధనువు నేనౌతా
కనులు నీవైతే
కరగని అనురాగచూపు నేనౌతా
మోము నీవైతే
మెరిసే లలాటలిఖితం నేనౌతా
స్వరం నీవైతే
సరాగాల రాగశరం నేనౌతా
స్వర్గం నీవైతే
సంతోషాల తూలికతల్పం నేనౌతా
హృదయం నీవైతే
హత్తుకునే ప్రేమమత్తు నేనౌతా
కష్టం నీవైతే
కాష్టంలోను వీడనిబంధం నేనౌతా
ఎద నీవైతే
ఎడదలో సవ్వడి నేనౌతా
వలపు నీవైతే
వీడలేని మోహావేశం నేనౌతా
భామినివి నీవైతే
భద్రతిచ్చే బావని నేనౌతా
.................
విసురజ

No comments: