
నింగిలోని హరివిల్లులే తెలుగు పల్లెల్లో అందంగా అలికిన రంగవల్లులు
నమ్మకాలకు అమ్మకాలు అంపకాలు జరగని ప్రదేశాలే తెలుగుపల్లెలు
పలకరించే నవ్వులతో అప్యాయత పంచే మనషులే తెలుగుపల్లె ప్రజలు
మనసుల్లోని తరగని మమతలే తెలుగువాళ్ళ ద్వారాలకు తోరణాలు
నెమలి నడకల సింగారాలే పడుచు సొగసుకు అలంకరించే సోకులు
రూపలావణ్యాలతో మనసును చిత్తరువు చేసేవాళ్ళే తెలుగు పడుచులు
పరువపు పరుగులెత్తే పరికిణి ముచ్చట్లే తెలుగు అందాలకు ప్రతీకలు
కన్నెపిల్లల కేరింతలే తెలుగు వాడలలో కవ్వించే పన్నీటి జలకాలు
...........
No comments:
Post a Comment