
కవిత: మనసే మురిస్తే
................
పూదోటలో పుష్పించి సువాసనిచ్చే పూవులెన్నో
మదితోటలో విరిసి ఎదను స్పర్శించే ఊహలెన్నో
చరణ కింకిణులే ఘల్లుఘల్లుమంటే హ్రుది నర్తించే
తడిమే అక్షరాలే పదకవితలల్లితే మది మురిసిమెరిసే
హ్రుదయ వైశాల్యమే ఎత్తుగా నిలిస్తే లోకం రూపుమారే
కలలే కన్నులలో కొలువై నిలిస్తే స్వప్నాలే శ్వాసగామారే
మలయ మారుతమే చల్లగా వీస్తే అలసిన మేను బడలికతీరే
తలపు తరిమితే మదినే తాకితే పరువమే పాటై పండుగమారే
............
విసురజ
No comments:
Post a Comment