ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 September 2013

Photo Photo

కవిత: తెలుగు వెలుగు/వెలిగే తెలుగు
.....................
అమ్మ పాలాల్లే స్వచ్చమైనది తేనెలూరు తెలుగు
వాన చినుకల్లే స్వచ్చమైనది తేనెలూరు తెలుగు

కోకిల పాటల్లే బహుదొడ్డ తీయనైనది తేనెలూరు తెలుగు
మామిది తాండ్రల్లే బహుదొడ్డ తీయనైనది తేనెలూరు తెలుగు

పున్నమి వెలుగల్లే కాంతివంతమైనది తేనెలూరు తెలుగు
ప్రేయసి దరహాశమల్లే కాంతివంతమైనది తేనెలూరు తెలుగు

సంపెంగల పూలల్లే సువాసనిచ్చేది తేనెలూరు తెలుగు
మల్లేమొగ్గల మాలలల్లే పరిమళించేది తేనెలూరు తెలుగు

వయసు కొచ్చిన సొగసరి సొకుసిగ్గల్లే సొగసైనది తేనెలూరు తెలుగు
ఏపుగా పెరిగి కోతకొచ్చిన పచ్చపచ్చని పంటపైరల్లే సొగసైనది తేనెలూరు తెలుగు

రంగురంగుల సీతాకోకచిలుకల రెక్కలల్లే మ్రుదువైనది తేనెలూరు తెలుగు
అధరసుధల రాగరాజ్ఞి ప్రియమనోహరి బుగ్గలల్లే మ్రుదువైనది తేనెలూరు తెలుగు

గరీబుకు భారమవుతున్న నేటి ఉల్లి ధరల్లే ఘాటైనది తేనెలూరు తెలుగు
ఘనచరిత్ర గల గుంటూరు ఎర్రమిర్చల్లే ఘాటైనది తేనెలూరు తెలుగు

మంచిమనసుకు మంచిమాటకు మంచిచేతకు ఎల్లలు లేవని చాటిచేప్పేది తేనెలూరు తెలుగు
సమాజహితంకు, సౌందర్యారాధనకు, సత్యసందర్శనకు ఎల్లలులేవని చాటిచేప్పేది తేనెలూరు తెలుగు

తెలుగు వెలుగును కనరా మనసైన తెలుగోడా
తెలుగు వెలుగుల క్రుషికే మనసును అర్పించరా తెలుగోడా
......
విసురజ

No comments: