ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 25 September 2013

కవిత: గుసగుసలు
.................
కడలితో అలల గుసగుసలు
ఉరుకులు పరుగులు అపై కక్కే నురగలు
శశాంకుడితో తారల గుసగుసలు
విరజిమ్మే వెలుగులు అపై మిణుకు మెరుపులు

పుడమమ్మతో పైరుల గుసగుసలు
పంచే పచ్చదనాలు అపై గాలికి ఊగే ఊయలలు
గగనంతో మబ్బమ్మల గుసగుసలు
కమ్మే మేఘాలు అపై కురిసే సంతోష చినుకులు

సోకుకత్తెతో సొగసుల గుసగుసలు
పలకరించే అందాలు అపై మురిసే జవ్వని పదమంజీరాలు
తలపులమ్మతో వలపుల గుసగుసలు
ప్రీతిమీర పలకరింపులు అపై విరిసే ఎదలో నందనవనాలు
...............
విసురజ

No comments: