
కవిత: వీడ్కోలు
..................
అమ్మకూతుర్ని ఆడకూతుర్ని నాన్న బంగారాన్ని
ఇంటి మహలక్ష్మిని పుట్టింటి పరువుని ప్రేమదీపాన్ని
పెరిగి పెద్దైనాక చదువుసంధ్యలు అబ్బినాక
వంటికి సొబుగులు అద్దినాక సోకులు సిగ్గులైనాక
పరిణయానికి వేళయ్యిందని నచ్చినింటికి నడవమంటే
కన్నవాళ్ళని వున్నవూరుని తోబుట్టువులందరిని వదిలేసి వెళ్ళాలంటే
అమ్మా..మనసు రావట్లేదే కంట నీరు ఆగట్లేదే
నాన్నా...నీ సం రక్షణ చక్రం వీడి అత్తారింటికి వెడుతున్న
చిన్ననాడు మారాం చేసి నీ మనసు కష్టపెట్టుంటే మన్నించమ్మ
ఎదిగేటప్పుడు మాట వినకుండా అల్లరి చేసుంటే మన్నించు నాన్నా
మరువను ఏనాడు మీరు చూపిన అనురాగ అభిమాన త్యాగాలను
విడవను ఏనాడు మీరు నేర్పిన విలువల నడతల నడవడికను
వెళ్ళి మళ్ళి వస్తానమ్మ కన్నీరు తుడుచోకోమ్మ
చల్లగా అశీర్వదించమ్మ అమ్మనాన్నల పేర్లు నిలబెట్టమని
........
విసురజ
No comments:
Post a Comment