
ఎదుటపడక ప్రేమంటావు
ఎదనీదంటావు కానరావు
కలలో కూడా నను వీడవు
ఎవరు నీవు ఎక్కడున్నావు
నిన్నే మది కోరే ఎట్టుంటావు
.................. ...............
నూరు మల్లెల బరువుంటావా
చెలి..పాలమీగడల నునుపు నీదంటావా
అందాల తారాడే పడుచువా
చెలి..పున్నవి వెన్నెల వెలుగు నీదంటావా
చిలిపి కళ్ళ చినదానవా
చెలి...వయసు విరగబూసిన సుమానివా
పలుకు తేనే మృదుభాషివా
చెలి...లుక్ తోనే లక్ తెచ్చే సుభాషిణివా
మిసిమి సొగసుల సోకువా
చెలి...రతీమన్మధుల తోబోట్టువువా
మనసు మెచ్చే సౌరభానివా
చెలి...హృదయం నిత్యం కోరే సాంగత్యానివా
ఎదుటపడక ప్రేమంటావు
ఎదనీదంటావు కానరావు
కలలో కూడా నను వీడవు
ప్రేమమీరా ప్రియుని చేరవా
చేరి ప్రేమను బ్రతికించవా
No comments:
Post a Comment