ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 25 September 2013

Photo: వెన్నదోచే చేతులే వలువలు ఎత్తుకెళ్ళిన చేతులే 
వన్నెచిన్నెలున్న ప్రియరాధమ్మ, నిన్ను చుడితే
వలదని దూరంగా వెళతావే కాదని నెడతావే
మరచావా ముందు సంగతి చెలి ప్రియ సఖీ మనోహరి 
గోవర్ధన పర్వతమెత్తి గోకులాన్ని కాచింది ఈ చేతులే 
నిండు కౌరవ సభలో ద్రుపదపుత్రి మానాన్ని కాచింది ఈ చేతులే 
ఆత్మలొకటైన రెండు వేర్వేరు కాయాలకు ప్రేమరాగం నేర్పింది ఈ చేతులే
వలచి వలపించి నేడు కాదని దూరంగా నెడితే మనగలడా ఈ కన్నయ్య 
అనురాగం వనంలో ప్రేమ పూలు మారల పూయించి నాకు పంచి 
వలపు పరిమళాల ఘుమఘుమలు తిరిగి అందించవా చెలి 
.....
విసురజ (04Sept13)

వెన్నదోచే చేతులే వలువలు ఎత్తుకెళ్ళిన చేతులే

No comments: