స్వగతాలు (ఎపిసోడ్ 2)
...........................
సొంతవాళ్ళనే కాక పొరుగింటి ఇరుగింటి వారిని కూడా ఆప్యాయంగా పిలుచుకునే ఒకప్పటి అనురాగాపూరిత పిలుపులు అత్తయ్య, పిన్ని, పెద్దమ్మ , మావయ్యా, చిన్నాన్నా ...వంటివి కనుమరుగువుతున్నా నేటి మోడరన్ పిలుపులు ...అంకుల్ అంటీలే స్థిరమైన వేళ.. నాటి ఆ పాత బంగారు సంగతులు గుర్తుచేసుకుంటున్నా...
నాకు బుద్దేరిగి నడక నేర్చి ప్రక్కింటికి గట్రా వెళ్లేనాటికి (విశాఖపట్నంలో సీతమ్మధారలో గవర్నమెంట్ క్వార్టర్స్) మాది క్రింద ఇల్లు. మా ఇంటి ప్రక్కనే బెర్హంపూర్, ఒరిస్సా నుంచి వచ్చి విశాఖపట్నంలో స్థిరపడి అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే కైలసరావు గారు వుండేవారు. చాల దొడ్డ మనిషి.. వారి ధర్మపత్ని..మాకు అత్తయ్య, అయన మామయ్యా. వారికి ఇద్దరు అమ్మాయులు.. ఇద్దరు అబ్బాయిలు.. పెద్దమ్మాయి ..లక్ష్మి నాకు ఊహ తెలిసేనాటికే పెళ్లి అయిపోయింది. రెండో అమ్మాయి కృష్ణ మా మూడో అక్కకు సహపాటి. పెద్ద అబ్బాయి పేరు వేణు, కానీ నేను పెట్టిన పేరు ..జేమ్స్ ( వాడు పుట్టినప్పుడు, ఆ రోజుల్లో నా ఫేవరేట్ నటుడు...కృష్ణ...ఎక్కువ సినిమాల్లో జేమ్స్ బాండ్ గా నటిస్తుండే) దాంతో వాడికి ఆ పేరు పెట్టా.. ఈ రోజుకి వాడికి తన అసలు పేరు స్కూల్లో వరకే.. ఇంటా బయటా ఈ రోజుకి వాడు జేమ్స్ అంటేనే పలికే. రెండవవాడు పేరు చక్రపాణి కానీ వాడిని మేము ముద్దుగా బుల్లి అనేవారం. ఈ రోజుకి వాడికి ఆ పేరే స్థిరమైయింది. జేమ్స్ నాకన్నా నాలుగైదు ఏళ్లు చిన్న వాడికన్నా బుల్లి మరో రెండు ఏళ్లు చిన్న అనుకుంటా.. మేమందరం ప్రతి రోజు ఆడుకుంటూ కొట్టుకుంటూ కలుసుకుంటూ ..చెప్పలేను..తలుచుకుంటుంటేనే నా మనసు మురిపాలు పొందుతున్నది. ప్రక్కింటి అత్తయ్యగార్ని విసిగిస్తూ మురిపిస్తూ అల్లరిచేస్తూ ఉండేవాడిని, అందరిచేత చేయించేవాడిని. ఆవిడే నాకు ఇచ్చిన బిరుదు..సీతమ్మధార రౌడి అని. దాన్ని బట్టి నా అల్లరి రేంజ్ అర్ధం చేసుకుంటారుగా..
అక్కడ అప్పుడు నా సమవయసు వాళ్ళు చాల మంది వుండేవారు.. అందరు ఉద్యోగస్తులు..దర్జాలు డాబులు చూపించే బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళు లేరు. నెలాఖరుకి తడుముకోవడాలు, అత్తయ్య అంటూ మా ఇంటికి కాఫీ పొడికి ఒకరు వస్తే, మరొక ఇంటికి పంచదారకి అలాగే కొంచెం రెండు సేర్లు బియ్యంకి, అకస్మాత్తుగా చుట్టాలు దిగి పోవడంతో ..రాత్రికి కొంచెం కూర ఉందా, పచ్చడి ఉందా.. అలాగే కూరలు, పచ్చళ్ళు ఇచ్చి పుచ్చుకోవడాలు.. స్వీట్స్ గట్రా చేస్తే ప్రక్క ఇంటిలో ఇచ్చిన తరువాతే తినడాలు గట్రా ఇప్పుడు ఎక్కడున్నాయి. ఆవకాయ కారాలు పెట్టినప్పుడు, రోట్లో దంపినప్పుడు, వొంట్లో బాలేనప్పుడు ఒకరికి ఒకరు చేయూతగా వుండడం ఇప్పుడెక్కడా.. పుస్తకాలు కొనేటప్పుడు, మీరు స్వాతి కొనండి, మేము జ్యోతి కొనటం, మేము బాలమిత్ర, మీరు చందమామ కొందాం ఇట్లా అనుకుని కొనడం తరువాత ఇచ్చిపుచ్చుకోవడం జరిగేవి. స్టీల్ సామానులు వాడు వచ్చినా, చీరాల వాడు వచ్చిన అందరు కలిసి కూర్చోవాల్సిందే, ఎవరు కొనినా కొనకపోయినా కలిసి బేరమాడవలసిందే. అలాగే చీట్లు కట్టడం గట్రా.. చెడైనా మంచైనా మేమున్నాం అంటూ ముందుకు వచ్చేవాళ్ళు.. కార్తీక మాసంలో విహారాలకు వెళ్ళాలన్నా, ఎప్పుడైనా మా వైజాగ్ బీచ్, గుడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళడమే ..
అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది వున్నారు, అంతెందుకు..మనమే ఎంత మందికి సాయంగా ఉంటున్నాం. సొంత సోదరో/సోదరుడే ఏదైనా చీటీ కట్టి తరువాత డబ్బు పొందే ముందు సాక్షి సంతకం అడిగితే నాకేంటి అంటూ ఆలోచించే కుచ్చితత్వం మనలో చేరింది అన్నది సత్యం. అలాంటి దుర్మతలు రూపుమాపుకుంటేనే జీవితం అగును ఆనందమయం.
ముచ్చటైన విషయం ఏమిటంటే మా కైలసరావు మామయ్య అత్తయ్య ఇద్దరు కలిసి ఎక్కడికి ఒకేసారి వెళ్ళేవారు కాదు, అయన పొట్టి, ఆవిడ పొడుగు.. అందుకే అయన ముందు ముందుగా వెళ్ళేవారు ఆవిడ వెనక నడిచేవారు.. మా కైలసరావు మామయ్యా దొడ్డ మనిషి అని చెప్పాగా..అయన తన వాళ్ళని ఒక్కరిని ఒరిస్సా నుంచి తెచ్చి చదువు చెప్పించి వాళ్ళని సెటిల్ చేసేవారు.. ఆవిడ మహాసాద్వి ఎప్పుడు నోరు పెట్టి ఆయనను ఏమనలేదు.. ఆ జీతంలోనే అందులోనే గుట్టుగా సంసారం చేస్తూ వాళ్ళందరిని సెటిల్ చేసేవారు. అలాంటి వారిని, వారి మంచితనం గ్రహించ బట్టే, అవన్నీ చూడబట్టేగా మన నడత, మనం జీవితంలో పాటించవలిసిన మార్గ నిర్దేసం జరుగుగా. సాయంత్రాలలో అందరం ఆరుబయలు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, విషయాలు చర్చించకోవడం వీటితో మనం నేర్చవలసిన, అవలంబించవలసిన తీరు తెన్నులు తెలుస్తాయి.
మరోసారి మా పాత వైజాగ్ విషయాలు విన్నవించుకుంటా
.............

No comments:
Post a Comment