కవిత: స్నేహ ప్రార్ధన
..........
వేడుకైన మది నేస్తమే పలకరించ
పల్లవించిన తీపి స్నేహమే పులకరించే
హృదే ఊయలూగ చెప్పెనెన్నో మధుర ఊసులు
వ్యధే మాయమవ్వ తెలిపేలే ప్రీతిగా కబుర్లు
తలవని నాడు పిలవని నాడు ఎదలో వేదనే
పలుకని నాడు కలవని నాడు ఎంతో పీడలే
రాతల రాయంచవే చేతల చైత్రానివే
మాటల మనోజ్ఞావే గానాల గాయనివే
పద్దతుల పట్టుకొమ్మ కాస్త పరికిస్తే మురిపమేగా
సుచరిత శాంతమమ్మా నీవు కోపిస్తే ప్రళయమేగా
అందరు ఒక్కలా వుండరమ్మ కాస్త నమ్మవమ్మా
బెదురు అదురు వదిలేయమ్మ కాస్త నవ్వవమ్మా
పేర్చిన గీతమాలిక స్వరాలతో శ్రుతి చెయ్యవమ్మ
కూర్చిన స్నేహగీతిక రాగాలతో పాడి పెట్టవమ్మ
..............
No comments:
Post a Comment