ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 26 December 2013

Photo: కవిత: రాధ వగపు 
....................
బెదురు చూపులతో బెంబేలు పడుతున్నావేమి 
ఓ కృష్ణసఖి రాధా

విషణ్ణ వదనంతో విచారంగ కనబడతున్నావేమి 
ఎందుకు నీకీ బాధ 

పొద్దెక్కి సాయంసంధ్య కూడా కావచ్చినా  
కన్నయ్య ఇంకా రాడేమి రాలేదనా 

పిచ్చెక్కి మనస్సంతా అదో మాదిరయ్యే
ఏ సవతి కొంగున ముడివేసుకుందోననా 

బెంగ వలదు చింత వీడుదూ ప్రేమపావని
నీ వాడేలే రాధ నిను వీడడులే గోపాలుడు   

తలపు మారదు వలపు వీగదు నవయవ్వని  
నీ స్మరణే సదా నిను మరువడులే శ్రీకృష్ణుడు  
.........
విసురజ

కవిత: రాధ వగపు 
....................
బెదురు చూపులతో బెంబేలు పడుతున్నావేమి 
ఓ కృష్ణసఖి రాధా

విషణ్ణ వదనంతో విచారంగ కనబడతున్నావేమి 
ఎందుకు నీకీ బాధ

పొద్దెక్కి సాయంసంధ్య కూడా కావచ్చినా
కన్నయ్య ఇంకా రాడేమి రాలేదనా

పిచ్చెక్కి మనస్సంతా అదో మాదిరయ్యే
ఏ సవతి కొంగున ముడివేసుకుందోననా

బెంగ వలదు చింత వీడుదూ ప్రేమపావని
నీ వాడేలే రాధ నిను వీడడులే గోపాలుడు

తలపు మారదు వలపు వీగదు నవయవ్వని
నీ స్మరణే సదా నిను మరువడులే శ్రీకృష్ణుడు
.........

No comments: