ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 13 January 2014

Photo: కవిత: రాను జాగేలరా
..........................
పదునైన చూపుల విరితూపుల బాకులతో 
ప్రియతమా ఈ పేదగుండెని చిద్రం చేయకురా 
నీ చూపులలో చూపులు కలపలేక
నీ నీలివేణి నేలచూపులు చిందించేగా  
మమతే మదిగడపే మనసై దాటితే
పలుకే తీపితిమ్మెరై చల్లగా తాకదా
నీతో చూపులే కలిపితే కవనానికి నాంది వేస్తావు 
నీవే హృదినే తడిమి వలపుకి భాష్యం చెప్పేవు 
పరువాల లోగిలిలో పలకరించిన స్నేహమా 
తలపుల వాకిళ్ళలో సేవించిన ప్రాణమా
వెంచేయవా సఖా నీకై వేచిచూసే 
చాన్నాళ్ళుగా ఈ నా మది
మురిపించవా వచ్చి నిన్నే వరించేగా  
యిన్నేళ్ళుగా ఈ చిన్నది
..........
విసురజ  (01.01.2014)

కవిత: రాను జాగేలరా
..........................
పదునైన చూపుల విరితూపుల బాకులతో 
ప్రియతమా ఈ పేదగుండెని చిద్రం చేయకురా 
నీ చూపులలో చూపులు కలపలేక
నీ నీలివేణి నేలచూపులు చిందించేగా 
మమతే మదిగడపే మనసై దాటితే
పలుకే తీపితిమ్మెరై చల్లగా తాకదా
నీతో చూపులే కలిపితే కవనానికి నాంది వేస్తావు
నీవే హృదినే తడిమి వలపుకి భాష్యం చెప్పేవు
పరువాల లోగిలిలో పలకరించిన స్నేహమా
తలపుల వాకిళ్ళలో సేవించిన ప్రాణమా
వెంచేయవా సఖా నీకై వేచిచూసే
చాన్నాళ్ళుగా ఈ నా మది
మురిపించవా వచ్చి నిన్నే వరించేగా
యిన్నేళ్ళుగా ఈ చిన్నది
..........

No comments: