కవిత: బాల్య జ్ఞాపకాలు
............................
చెంగుచెంగున దూకే లేడీకూనల్లే
పడిలేచేటి జలపాత తరంగాలల్లే
బాల్యపు గురుతులు ఎదను తడిమే
కళ్ళల్లో నీరే చిప్పిల్లి మది మురిసే
వర్షపు చినుకలే తడిపి పలకరిస్తే
పరవశించి నేనాడిన చిందులు గుర్తొచ్చే
కురిసిన నీరే కాలువలై పారితే
కాగితపు పడవలాటల కేరింతలు గుర్తొచ్చే
పక్కింటి బుట్టబొమ్మే జడకుచ్చులతో తిరుగుతు మురిపిస్తూ కులికితే
ఉలుకుతో జడకుచ్చులు లాక్కుని దాక్కుని ఏడిపించింది గుర్తొచ్చే
ఎదురింటి పండుగాడే కొత్తకారు బొమ్మ చూపిస్తూ ఉడికిస్తే
ఉక్రోషంతో అమ్మని నాకూ అదే కొనమని మారంచేసిందీ గుర్తొచ్చే
నింగిలో ఎగిరే విహంగాలను, విమానాలను విస్తుపోయి చూస్తూ ఉండిపోతే
బాగా చదువుకుంటే నీవు కూడా నింగిని తాకగలవన్న అమ్మ చెప్పిన సంగతి గుర్తొచ్చే
ప్రక్కింటి వాళ్ళ చెట్టులకు కాచిన మామిళ్ళు, ఉసిరికాయలు, రేగిపళ్ళే తెగ ఊరిస్తే
చీకటి వెలుగుల్లో దక్కి చెట్టు ఎక్కి ఊరించిన పళ్ళను దోచిన సంగతులు గుర్తొచ్చే
ప్రక్కింటి పాపే వేయించిన పేలాలు, మిఠాయిలు, ఉడకబెట్టిన వేరుశనగలు తెస్తే
కాస్త అదిలించి తనని కాస్త బెదిరించి వాటిని కాకేంగిలిగా పొందిన సంగతి గుర్తొచ్చే
సెలవుల్లో ఉదయపు వేళలలో ఆటలపోటీలలో స్పర్ధలతో కూడిన విషయాలేమంటే
చిన్ననాడు ఆడిన గోళీలాట, బొంగురాలాట, ఏడుపెంకులాట, కర్రాబిళ్ళాట గుర్తొచ్చే
చీకటి రాత్రుల్లో కరెంట్ కోతల్తో చుట్టుపక్కల అందకారమేర్పడితే బయటకు వచ్చి
తొలినాళ్ళలో పక్కింటివాళ్ళతో ఆడిన డీఫాట, దొంగాపోలీసాట, అమ్మానాన్నాటలూ గుర్తొచ్చే
కలిచి వేస్తున్న కాలంలోనూ బాల్యపు స్మృతులే ఆప్యాయంగా పలకరిస్తే
మదిలో ఆనందమే నర్తించే వీటితో మహిలో జీవితం మరింత అందంగా ఉంటుందని గుర్తొచ్చే
..............
విసురజ

No comments:
Post a Comment