ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 15 January 2014

Photo: కవిత: మురళీ విలాసం   
...........................
శిశిరపు పొద్దులో తెల తెలవారు వేళ కన్నయ్య 
పల్చని మంచు తెరలు అవనిని నిండుగా కప్పే కృష్ణయ్య
సూరీడు పూర్తిగా పలకరించని లేత వెలుగులలో 
మురళి వాయిస్తూ కనిపిస్తే నీవు శిఖిపింఛమౌళి  
దక్కి దాగి నిను క్రీగంట తేరిపార చూశాలే నీలిమేఘశ్యామ
వేణువుతో రాగసుధలే పాడ గిలిగింతల తమకమాయే
నులివెచ్చని సిగ్గు తెరలందుకే నా మోముని పలకరించే, 
హేమంతపు చలి పొద్దులోనూ గ్రీష్మతాపమే నన్నావహించే
ఎదుటపడి పలకరించలేను బిడయమయే శ్రీకరా ప్రియమాధవా
దూరంగా నిలిచివుండలేను ప్రణయమాయే శ్రీధరా ప్రియబాంధవ
చెలిపై ఈ నెచ్చెలిపై కనికరించి కాస్త కరుణిస్తే చక్రధారి 
రాధనై నీ హృదిరాణినై యిహంలో పరంలో వెన్నంటుంటా ప్రియమోహనా         
........
విసురజ

కవిత: మురళీ విలాసం 

No comments: