ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత: సరాగ హేల

మంచు కురిసే వేళలలో తనే పలకరిస్తే 
పండు వెన్నెలలో నీవు నాతో సరాగమాడితే 
మదిలో తొంగిచూసే వేవేల కొత్త భావాలు
నీతో ఏదేదో చెప్పాలనొకటే తీవ్ర ఆరాటం
నిను చూసిన అనందంలో అక్షరాలు మరచాను
మాటరాని బొమ్మని మూగని నిశ్శబ్దగీతాన్ని అయ్యను
మనసులో తేరిపార చూస్తేగానీ మర్మం అర్ధమవ్వలేదు
అనురాగ భావాలకు ఆధారరూపం ప్రేమదీపం నువ్వని
ఎదపలికే ఆత్మీయ రాగసుధా గేయానివి నీవని
నా మనసంతా నిండిన ప్రేమదేవత నువ్వని
నీవే నా అవని ఆకాశం నింగి సర్వం నువ్వని
.........
విసురజ 

No comments: