ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత:సూర్య తాపం

ప్రభాతవేళ ఉదయించే ఉదయభానుని
అత్మీయ దీవెనల పలకరింపు
ఎరుపు మెరుపుల పసిడివర్ణాల 
ప్రత్యుష కిరణాల చిలకరింపు
జగానికి జనానికి జగన్నాధుడికి
మనసారా కలిగే పులకరింపు
భాలభానుడి మేల్కొలుపుల గీతాలు
ఉత్సాహావేళల భావుకతకిచ్చే వేయర్ధాలు
నిండుగ మండే ప్రచండభానుడి
మిట్టమధ్యాహ్నపు పలకరింపుల మిసమిసలు చిటపటలు
పరవశింపచేసే ప్రక్రుతి పచ్చదనానికి
విలువైన ఒనరులను సమకూర్చుకునే యత్నాలు
పడిలేచే కడలితరంగాల నీటిచెలమలను
వేడిమి ఆవిరిచేసి నింగికి ఎగరేయించే 

ఎగిసిన ఆవిరినే ఒడిసిపట్టి 
చినుకై మబ్బమ్మ కురిసి 
ధరణి జీవాల దాహార్తితీర్చే
సాయంకాలపు నీరెండ క్రీనీడలు
అహ్లాదమైన సాయంత్రాలకు పలుకు ఆహ్వానాలు
అందమైన సంధ్యవేళల అనందాలు
అత్మీయుల సాంగత్యములోనైతే మిగిలేగా మధురానుభూతులు 

No comments: