ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత:వాస్తవమేగా

వాగ్దేవి పలకరించిన ప్రతీవోడు పుంభావసరస్వతైపోడు
శ్రీదేవి నవ్విందని ప్రతీవోడు శ్రీనాధుడైపోడు
పార్టీలు పెట్టిన ప్రతీవోడు ముఖ్యమంత్రైపోడు
ఖద్దరు కట్టిన ప్రతీవోడు నాయకుడైపోడు
జంధ్యం వేసిన ప్రతీవోడు బ్రహ్మజ్ఞానైపోడు 
బేరసారాలు ఆడే ప్రతీవోడు కష్టమరైపోడు
కవనదాహం వున్నా ప్రతీవోడు కవిరాజైపోడు
కనకదాహం వున్నా ప్రతీవోడు కోటీశ్వరుడైపోడు
కాసింత కళాపోషణ వున్నా ప్రతీవోడు గిరీశమైపాడు
కూసింత రసహృదయం వున్నా ప్రతీవోడు కృషరాయలవ్వడు
అర్హతలేనినాడు అందలము అందినా ప్రయోజనం శూన్యం
అటకెక్కలేనివాడు అంబరం అందాలన్న ఆశే హానికరం 

No comments: