ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

కవిత: ఇదీ ప్రేమేగా

సొగసుగత్తె మేనితావి ముంగురుల శోభ వర్దిల్లంగా
విరిపరిమాళాలే శరణాగతంటూ నీ ముందు సాగిలపడేగా
వివరమడగ ప్రేమదేశం పేరుచెప్పి ఊరి వివరమీయకుండా తరలింది
కిసుక్కున చెలి నీవు నవ్వి కసుక్కున్న గుండెను కోసింది
మబ్బుల దుప్పటి కప్పుకుని చంద్రుడు మొద్దుగానిద్రోయే
రాని వెన్నెలకై జరగని ప్రేమవిహారాలపై విరహదాసులు వాపోయే
కళ్ళుకలిపి గుండెలోకి చూసి బహుప్రీతిగా చూపులవిందు ఆరగించావు 
చెలిపై మక్కువ మనసిష్టాన్నిముఖప్రీతికైనా గిఫ్టులతో కొలుస్తావనవేమి
కుదిరిన వలపు తీయని తలపులు ఎదనిండా తహతహలు పెంచే
చెలి పలుకు గోముగా పిలుపు కుదురుకానీ నన్ను అనుక్షణం నిలువరించే
సురచిరస్మరణీయ సుకవనానికి గీర్వాణి చల్లనిచూపు అత్యవసరం
చెలువము ప్రేమా అనురాగసంగామానికి అలరించే అమ్మణ్ణి అండ అవసరం

No comments: