అల్లంతదూరాన నల్లనయ్య పిల్లనగ్రోవి
పిలుపు వినవచ్చింది
చెవులకింపైన సుస్వర నాదరవం
రాధిక హృది తాకింది
ఒక్కుదుటన బిరబిరా శిఖిపింఛమౌళిని
చేరుటకై పరుగెత్తింది
లీలమనోహరుని కంటిచూపు కరస్పర్సకై
మనసారా వేచింది
పిలుపు వినవచ్చింది
చెవులకింపైన సుస్వర నాదరవం
రాధిక హృది తాకింది
ఒక్కుదుటన బిరబిరా శిఖిపింఛమౌళిని
చేరుటకై పరుగెత్తింది
లీలమనోహరుని కంటిచూపు కరస్పర్సకై
మనసారా వేచింది
తీరాచేరి తేరిపారచూడ తన్మయత్వముతోడ
రాధమ్మ మోము ఎర్రబడే
వసుధనాయకుడు విహారి గోపెమ్మలతో
గమ్మత్తుగా దోబూచులాడుచుండే
పరంధాముడు శ్రీహరి సిరికన్నియలతో
ప్రీతితో సరసల్లాపాలాడుచుండే
రాధమ్మ మోము ఎర్రబడే
వసుధనాయకుడు విహారి గోపెమ్మలతో
గమ్మత్తుగా దోబూచులాడుచుండే
పరంధాముడు శ్రీహరి సిరికన్నియలతో
ప్రీతితో సరసల్లాపాలాడుచుండే
ప్రేయసి రాధను చూసిన కంసభంజనుడు
సర్వులును విడిచి తనవైపే వచ్చే
సవతి బాధను చవిచూసిన రాధహృదయము
మోహనవలపుని త్యజించి వైరాగ్యంపైకి మరలే
వెన్నముద్దలవాడు మెల్లంగా చెంతచేరి
సఖిరాధకు వేడిముద్దులివ్వ
కోపాలు సమసే ప్రణయాలు విరిసే
ప్రేమతత్వముతో జగత్కల్యాణమునకు
కృష్ణయ్య దశ/దిశ సూత్రములు తెలిపే
........
సర్వులును విడిచి తనవైపే వచ్చే
సవతి బాధను చవిచూసిన రాధహృదయము
మోహనవలపుని త్యజించి వైరాగ్యంపైకి మరలే
వెన్నముద్దలవాడు మెల్లంగా చెంతచేరి
సఖిరాధకు వేడిముద్దులివ్వ
కోపాలు సమసే ప్రణయాలు విరిసే
ప్రేమతత్వముతో జగత్కల్యాణమునకు
కృష్ణయ్య దశ/దిశ సూత్రములు తెలిపే
........

No comments:
Post a Comment