తొలిచూపు మెత్తగా గుచ్చి తాకింది
ఎదగూటిని పక్కగా వచ్చి చేరింది
తలపుల మల్లెలు ఎదలో విరబూస్తే
మనసు పరిమళాలు మోముని తాకవా
మనసు లోగిలిలో తలపులు ముగ్గులేస్తే
విరుల గొబ్బెమ్మలెట్టి వలపు మురవదా
పలకరించే మనసుచిలక పాడంగా గీతాలెన్నో పరవశించే హృదయానికి నర్తనలే మొత్తంగా
No comments:
Post a Comment