దరహాసాల ముంగిట్లో
పరిహాసాల పకపకలు నప్పవు
పరిహాసాల పకపకలు నప్పవు
పరవశాల ప్రాంగణంలో
పరితాపాల లెక్కలు కూడవు
పరితాపాల లెక్కలు కూడవు
నవరసాల నర్తనలలో
నీరసరాగాలు అస్సలు చెల్లవు
నీరసరాగాలు అస్సలు చెల్లవు
తనూల్లత తపనలలో
సరసల్లాప సరిగమలు తప్పవు
సరసల్లాప సరిగమలు తప్పవు
మధుమాసపు పలకరింపులలో
చివురుల సంతకాలు చూడగలవు
చివురుల సంతకాలు చూడగలవు
వలపులాపరిమళించే ప్రకృతిలో
తలపులాఘ్రహణచే మత్తెక్కగలవు
తలపులాఘ్రహణచే మత్తెక్కగలవు
ప్రేమసముపార్జనల వేళలలో
బరువుగుండెలకన్నులనీరులు తప్పవు
బరువుగుండెలకన్నులనీరులు తప్పవు
No comments:
Post a Comment