మైత్రీవనంలోని అత్మీయ మొక్కలం
స్నేహమధువును గ్రోలిన పక్షులం
అవ్యాజానురాగాలకు తపించే మనుష్యులం
ముఖపుస్తకం అందించిన అత్మబంధువులం
స్నేహమధువును గ్రోలిన పక్షులం
అవ్యాజానురాగాలకు తపించే మనుష్యులం
ముఖపుస్తకం అందించిన అత్మబంధువులం
కలిసినా కలవకపోయినా ఒక్కసారైనా
సదా ఎదుటవారి స్మరించేవాళ్ళం స్మరణలో వుండేవాళ్ళం
చూచినా చూడకపోయినా ఒక్కమారైనా
నిత్యం అనునిత్యం ఆ చాన్సుకై నిరీక్షణలో వుండేవాళ్ళం
సదా ఎదుటవారి స్మరించేవాళ్ళం స్మరణలో వుండేవాళ్ళం
చూచినా చూడకపోయినా ఒక్కమారైనా
నిత్యం అనునిత్యం ఆ చాన్సుకై నిరీక్షణలో వుండేవాళ్ళం
రాసింది ఏమన్నది ముఖపుస్తకంలో పోస్టుగా పెడితే
రాసింది ఏలాగన్నది తిరుగుటపాలో తెలుస్తుందిలే
మోహమాట మిత్రులు లైకు కొట్టి ఊరుకుంటే
అబ్బే నీ పోస్ట్ చదవడమనేది ఉత్తిదండుగే
ఎల్లరు మరి కామెంట్ పెట్టి ఊదరగోడితే
అబ్బో మరింక సదరు పోస్ట్ పంట పండినట్టే
రాసింది ఏలాగన్నది తిరుగుటపాలో తెలుస్తుందిలే
మోహమాట మిత్రులు లైకు కొట్టి ఊరుకుంటే
అబ్బే నీ పోస్ట్ చదవడమనేది ఉత్తిదండుగే
ఎల్లరు మరి కామెంట్ పెట్టి ఊదరగోడితే
అబ్బో మరింక సదరు పోస్ట్ పంట పండినట్టే
డబ్బు పెట్టి కొనలేం స్నేహాన్ని
అరచి అదిలించి చెయ్యలేం స్నేహాన్ని
మదుపు పెట్టి ముందుకుతీసుకెళ్ళలేం స్నేహాన్ని
ఆంక్షల అనుమానాలతో చెయ్యలేం స్నేహాన్ని
అరచి అదిలించి చెయ్యలేం స్నేహాన్ని
మదుపు పెట్టి ముందుకుతీసుకెళ్ళలేం స్నేహాన్ని
ఆంక్షల అనుమానాలతో చెయ్యలేం స్నేహాన్ని
తీయని మనసు తియతీయని పలుకే కోరు స్నేహం
తీసెయ్యి అడ్డగించే తెరలను వాటిని దాటెయ్యి నేస్తం
నెమ్మది మాటలు నెమ్మదించే చేష్టలనే కోరు స్నేహం
తుడిచెయ్యి అహంకార పొరలను విడిచెయ్యి వెయ్యినాల్కల తోరణం నేస్తం
తీసెయ్యి అడ్డగించే తెరలను వాటిని దాటెయ్యి నేస్తం
నెమ్మది మాటలు నెమ్మదించే చేష్టలనే కోరు స్నేహం
తుడిచెయ్యి అహంకార పొరలను విడిచెయ్యి వెయ్యినాల్కల తోరణం నేస్తం
స్రుష్టిలొ అతితీయనిది స్నేహం
పుష్పాలతో అలంకరించతగ్గది స్నేహం
పద్యాలతో అర్చించతగ్గది స్నేహం
పల్లకీలో ఊరేగించతగ్గది స్నేహం
ఎందరికో ప్రాణంపోసేది స్నేహం
ఎందరినో తీర్చిదిద్దేది స్నేహం
దూరాలకు పెనుభారలకు లొంగనది స్నేహం
ఐశ్వర్యానికి అడంబరాలకు పొంగనది స్నేహం
లేమిని లోపాలనీ తోసిరాజనేది స్నేహం
అందుకే నేనందుకున్న స్నేహామ్రుతమను చూసి గర్విస్తా
అందుకే స్నేహమా నీకు నమస్కారం
మిత్రులై మీరందరందించిన అభిమానధనాన్ని పొంది మురుస్తా
అందుకే స్నేహమా అందుకో వణక్కం సలాం

No comments:
Post a Comment