ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

కవిత: సిసలైన ఉషోదయమంటే

నిశీధి చీకట్లను లోకాన పారద్రోలి
ధవళ కాంతులను ఇలలో విరజిమ్మువేళ..
అందమైన భూపాల రాగాలను వసంతవేళ
కోయిలగంధర్వుడే మధురంగా ఆలపిస్తున్నవేళ
అరుణారుణ కాంతులలో పుడమి మెరుస్తున్న వేళ
పసిడి రవికిరణాల స్పర్సతో ధరణి మురిసేవేళ
అదిగో అపుడే మదిలో ఎదో గీతమిలా పలుకుతోంది
నా భావ ఝరులే నీ భావ విరులై పూసినవేళ
నా మది తలపులే నీ హృది తలపులను తీయించే వేళ
నీ గైర్హాజరితో నిండిన నా హృదినిశి నైరాశ్యాలను
నీ పలకరింపుల ఉదయకాంతులే దూరంచేసే వేళ
నాకప్పుడే మనసా అసలైన నిజమైన ఉషోదయం అరుణోదయం శుభోదయం
ఒప్పేదప్పుడే మనసారా జీవితాన అరుదెంచిన కాంతిని పూర్ణక్రాంతిని
.............

No comments: