ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) ఆశయాల ఆవరణలో చేరి నిలవాలంటే అవహేళనల ముగ్గులు, తిరస్కారాల గొబ్బెమ్మలు, నిరాదరణ గోడలు దాటాలి, మొక్కవోని ధైర్యంతో
2) గరీబుకి, తినే పట్టెడన్నం కోసం తెల్లారి లేచింది మొదలు ఎన్ని ఆరాటాలో, ఎన్నెన్ని ఝంఝాటాలో...డబ్బు, దస్కం అన్నీ వుండి కూడా ఇంకా తపనలు పడితే..మరిహ తరించనట్టే, వారి బ్రతుకిక తెల్లారినట్టే..
3) కుర్రాళ్ళ గుండెల్లో ధైర్యం, తెగువ, దేశభక్తి, ఆశయసిద్ది పట్ల నిబద్దత కొరవడితే మరిక ఆ దేశభవిత ఆందోళనలో పడ్డట్టే..పెద్దవాళ్ళు, గురువులు, తలిదంద్రులు అందరు వారిని తీర్చిదిద్దటంలో విఫలం అయినట్టే..

No comments: