ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) ప్రతి బిడ్డ పవిత్రుడే, ప్రతి ప్రాణి వరదాయే... పుట్టుకలో దోషాలంటూ ఎప్పుడూ వుండవు, వుండరాదు ..పెరిగే వాతావరణంలో, చుట్టూ వున్నావాళ్ళ మనస్తత్వాల్లో తప్ప...గంజాయి వనంలో తులసమ్మకి విలువ దక్కేనా!
2) నిబద్దత, సమయపాలన మరియు నెమ్మదితో కూడిన ఓపికా సౌలభ్యం కలవారు లక్కీ అమ్మ (లక్ష్మి అమ్మ) తలపు తట్టినప్పుడు సంసిద్దంగా వుండి, లక్కీ అమ్మ కృపకు పాత్రులగుదురు....అందుకే అంటారు.. ప్రజ్ఞ కన్న ఓపిక/నిబద్దత/సమయపాలన/డిసిప్లిన్ ఎక్కువ లాభం చేకూరుస్తాయని!
3) అనాదిగా చేయబడుతున్న హేయమైన పని, గర్హనీయమైన పని.... ఇంకొకరిలో తప్పులని వెతకడం, మరోకరి కార్యక్షేత్రంలో అనవసరంగా తల దూర్చడం...గురివింద గింజ మాదిరిగా తమలోని లోపాలను మరచి లేక వాటిని కప్పిపుచ్చదలచి...పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే..లొకమ్ చూడటంలేదు అనుకుంటే నిజమవుతుందా!

No comments: