ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 December 2014

1) పరులను పలుచన చేస్తూ సాగు ఏ ప్రక్రియ గానీ, ప్రవర్తన గానీ, పద్యము గానీ, సంబరాలు గానీ, పండుగ గానీ అందించేది క్షణిక తృప్తే తప్ప చిత్తశాంతి కాదు..
2) గుండె లోతుల్లోంచే వినవచ్చే మాట సదా విని అవ్విధముగా నడిచే నడత వుంటే నలుగురిచే పూజింపబడడమనే మాటెల వున్నా నీకు నీ ఆత్మక్షోభ వుండదు.
3) చదివేమా లేదా పుస్తకం చేత బట్టేమా లేదా అన్నదానికంటే ఎంత అర్ధమయ్యింది, ఏమేర జ్ఞానప్రాప్తి జరిగింది, ఎంత మనోవికాసం విరిసింది అన్నదే మహత్తరమైన మాట..ఇది పరిగణలోవుంచుకుని చదువులు సాగితే...విద్యతో వివేచన, వివేకం అందు.. 

No comments: