ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 17 December 2014

1) రివ్వున ఎగిరే మనసుని కట్టడి చెయ్యడం, పరుగులు తీసే కాలాన్ని ఆపాలని చూడడం, వెర్రివాళ్ళకు బుద్దులు సుద్దులు చెప్పడం..అవివేకం//
2) విమర్శలు/నిందలేవి నీపై ఎవ్వరు వేయలేదని/వేయట్లేదనుకుంటే నీ ప్రగతికి ఎక్కడో గండి పడిందన్న మాటే.. ఎదిగే మనిషి ఎదుగుదలలో విమర్శలు/నిందలే నిచ్చెనలు//
3) మంచి మెచ్చని మనిషి, సవ్యపాలనివ్వని ప్రభుతా, సుద్భోధ/ఉద్భోధ చేయని గురువు...తమ తమ అస్తిత్వ లక్షణాలకు తిలోదికాలు ఇచ్చినట్టే.. అటువంటివారి సాంగత్యం హర్షణీయం కాదు 

No comments: