ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 December 2014

కవిత: సకలం నేనే..నేనే...నేనే

జగజ్జనినే ....జగాన్ని జనాన్ని సృజించేటప్పుడు
జాహ్నవినే....జనులకు జయాపజయాలను పంచేటప్పుడు
దుర్గమ్మనే.....దుర్మతాంధుల పీకను దునిమేటప్పుడు
భద్రకాళినే..... బడుగులపై బలవంతుల దాడినాపేటప్పుడు
కామాక్షినే... కామ్యములను ఒనర్చి పూర్తి చేసేటప్పుడు
పరమేష్టినే... ప్రజల పీడలక్రీనీడలను దూరంచేసేటప్పుడు
కాత్యాయనినే... కష్టాలఓడలను సుఖాలతీరం చేర్చేటప్పుడు
దాక్షాయిణినినే ...దుండుగుల దానవత్వాన్ని రూపుమాపేటప్పుడు
సింహరూడినినే .దుష్టుల దాష్టీకాలను ధ్వంసంచేసేటప్పుడు
ధూమావతినే.. .దూర్తుల దురాగాతాలపై దాడిచేసేటప్పుడు
జ్వాలాముఖినే...కర్మేష్టుల పాపాలను జ్వలించేటప్పుడు
త్రిపురాంబనే.. ...త్రిలోకాలను త్రికరణశుద్దిగా పాలించేటప్పుడు
లలితాంబనే.......లోకాన్ని లాభనష్టాలెక్కేయక ఏలేటప్పుడు 
భగ్లాముఖినే.... భవ్యభవితను నమ్మినోళ్ళకు పంచేటప్పుడు
అన్నపూర్ణనే... అన్నార్తులకు అత్మీయహస్తం అందించేటప్పుడు
శ్రీని నేనే స్త్రీని నేనే అబలను నేనే సబలైన సత్తాచూపేదీ నేనే
శూన్యం నేనే సర్వం నేనే సర్వజగత్తుకు ఆధారమైన అమ్మను నేనే 

No comments: