ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 18 December 2014

కవిత:తలపుల తర్జనభర్జనలు

పరువాల పల్లకీలో
మల్లెలు మరువాలు పరచాను
తలపుల బోయలతో 
మోస్తుండ ఊహలలో ఊరేగాను
కన్నులలో కాపురముండే
కమ్మని కలలకు రెక్కలిచ్చాను
కలలకు బ్రతుకువర్ణాలకు
నప్పక కన్నీళ్ళలో కరిగిపోయాను
ఎదలోని మాయనిగాయానికి 
హృదినే ఇంకుపెన్నుగా మార్చేసాను 
మదిలోని భావాలెన్నిటికో 
కవితా రూపమిచ్చి మురిశాను
మానుతున్న ఎదగాయాన్నే చల్లనైన శీతగాలి రేపిపోయినాయే
మారుతున్న ఋతుకాలాలే
మానసిక సంఘర్షణ పెంచిమురినాయే

తలపుల మలపులవంకల్లో
మాటువేసి నిలుచుండి నలిపేస్తున్నావే
కుదరని ప్రేమరహదారులలో
కొలువుండి ఎదకొంప కొల్లేరుచేస్తున్నావే
విడువమ్మ కుదరనిబంధాలను
కుత్సితాల ప్రణయప్రలోభాల రాపిళ్ళను
తడువమ్మ నిజనిర్మలప్రేమవర్షంలో
వలపుల దాహాలడగుత్తి పూర్తవ్వనూ 

No comments: