ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 19 January 2015

కవిత: ఎవరు నీవు

ఎవరు నీవు
కలలా సాగిన బ్రతుకుకవితగా
నన్ను 
జీవితనావకు చుక్కాన్ని చేసేవు
ఎవరు నీవు
సంద్రపుకెరటంలా దూకి పరుగిడే
నన్ను
చేపట్టి చెయ్యిపట్టి నిలువరించేవు
ఎవరు నీవు
అందాల నెమలికన్నుల సొగసులతో
నన్ను
కలవరించే కన్నుల్లో దాచేసావు
ఎవరు నీవు
ఉదయపు వెలుగునవ్వుల పువ్వంటి '

నన్ను 
నల్లని కంటికాటుకగా మార్చేసావు
ఎవరు నీవు
పరవశంతో తాండవమాడే గంగమల్లే
నన్ను
జాగ్రత్తగా చుట్టి నెత్తిని పెట్టేసావు
ఎవరు నీవు
సరాగ పరాగ సంపర్కాలతో
నన్ను
కుసుమరాజ్ఞివై ఢీకొట్టి పరిమళించేవు
ఎవరు నీవు
విరులరేరాణికి వలువలు అందించే
నన్ను
వెన్నెలప్రభలతో వలపురాజుగా తెలిపేవు
ఎవరు నీవు
చల్లగా విరిసిన స్నేహబంధములో
నన్ను
నమ్మకపు నాదస్వరమని రుజువుచేశావు
ఎవరు నీవు
మరుల మమతలతో పరాచికాలాడి
నన్ను
అనుభంధాలు నేర్పి అత్మీయుడినిచేసేవు
ఇలా అందరికీ పూర్తిగా తెలిసినా
నన్ను నేను తెలియకున్నాను
నీవు
చెపితే తప్పక తెలుసుకుంటాను
.......... 

No comments: