ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 September 2012

తెలుగు బాష ప్రభలు


తేట తేట భాషరా తేనెలూరు భాషరా
దేశ బాషలందు లెస్సరా మన తెలుగు బాష,
మన తెలుగు జిలుగులు విరజిమ్మేను వెలుగులు
ప్రభవించేను కాంతులు మనుమన శాంతి నింపేను
తెలుగు తేజ ప్రభలు చాటేను దిగ్దంతాలలో మెరుపులు
ఎందరో మహానుభావులు తెలుగు బాషకి పట్టం కట్టి మెరిసినారు
ఎందరో మహానుభావులు తెలుగు బాష వన్నే చూసి మురిసినారు
పేరు పేరు తెలుప వారి ఘనత సాధ్యమగున సాధ్యమయ్యేన
కవిత్రయం ఆద్యులైననేమి బ్రౌను పరదేశియుడైననేమి
విశ్వనాధ,వేమన,మల్లాది,గురజాడ,శ్రీశ్రీ తదితరులైననేమి
మక్కువ తోడ హృదియందలి కూరిమి తోడ
తెలుగు బాష వైభవమునకై ముందుకు వురికినారు
నడుము బిగించి తెలుగు బాష వున్నతికై పాటుపడినారు
నేటి తెలుగుదినోత్సవ దినాన నాటి పెద్దల స్మృతి అభిలాషనీయం
అజరామరమైన తెలుగు భాషకు ఛత్రం పడుతున్న అందరికి నా అభినందనములు
విసురజ

No comments: