ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 September 2012

చంద్రుడితో మొర

Saturday, July 30, 2011 at 9:19am ·

మబ్బుల్లోన దాగున్న చందురూడ
నీవు త్వరగ బయటకు రా
నీవు ఆడదాగుంటే దోబూచులాడితే
నా చిన్నవాడి మరాము తీర్చేదెట్టగా
వాడికి నిన్ను చూపి వెన్నేల్లో ఆరుబయల్లో
త్రిప్పి తిరుగాడి వెంబడించి గోరుముద్దలు తినిపించేనే
నీవే కానరానినాడు వాడిని వూరడించడమెల, గోరుముద్దలు తినిపించేదెల
(ఓ తల్లి అవేదన)

మబ్బుల్లోన దాగున్న చందురూడ
నీవు త్వరపడి రాకున్న నాకు యిబ్బందే
నీకు తెలియనిది కాదుగ మరి
నీకు నాకు మధ్యనున్న ఒప్పంద్ధం
నీవు రోజు చక్కగ వెలుగు నిచ్చి నన్ను చదివిస్తావట
నేను పెద్దయ్యకా నీ పేరు నా పిల్లలకు పెట్టుకుంటానంట
నాన్నేమో యింట్లో కరెంటు పెట్టడు డబ్బుల్లేమో లెవంటాడు
సర్కారి ఈస్కూల్లో ఫీజు లేని బడిలో చదివి వస్తే ఫస్టూ
నాన్నేమో మురిసిపోతాడు అందరిముందు నా బిడ్డంటాడు
అదే మార్కులు తక్కువస్తె తాట తీస్తాడు పనికి పోమ్మంటాడు
అయ్యో చందురుడా రేపు ఈస్కూల్లో పరీక్షాగా
నీవు మబ్బుల్లో దాగుంటే నా చదువు సాగేదెట్టాగ
మన మధ్యనున్న ఒప్పంద్ధం నిలిచెదెట్టాగ ( ఓ పిల్లవాడి అవేదన)

మబ్బుల్లోన దాగున్న చందురూడ
నీవు గాక నా మొర వినేదెవరు
ముచ్చటైన ఈడు లతిక లాంటి అతివ
ఇంట్లో వుండి యేమి లాభం లేదుగా
పక్క చేరి ప్రక్కన చేర మోద్దు నిద్దుర వచ్చె తనకి
తను నిద్దరోతె రాదుగ నాకు నిద్దర
రామ రామ ఈ బాధ ఎవరికి వద్దురా
నీవిన త్వరపడి మబ్బుల్లోంచి బయటకు వచ్చి
కాల్చే వెన్నెల నిచ్చి నా అతివ ఒంట్లొ సెగ రగల్చవా
సుమధుర ప్రణయ ఘట్టంకి అంకురం వేయవా
                                 (ఓ మగని అవేదన)

No comments: