Friday, August 5, 2011 at 9:38am ·
వలచినాను సఖి నిన్ను చూసిన తొలి క్షణం నుంచి
వేచినాను సఖి నీ చూపు నాతో కలవదా అని, నా కోసం వెతకదా అని
ఎదురుచుశాను రోజు నీ రాకకై వాన కోసం తపించే చకోరిలా
నిను చూసిన నాడు నాకు అమావాస్య యైన పండు వెన్నెలయే
నువ్వు కనపడని నాడు పండు వెన్నెల కూడ అమావాస్యయే
మనసార నవ్వుతావు హృదియంత నిండినావు
వలపు తెలపంగ జాగేలనే దరి చేరక నన్ను ఏడిపించతగునే
మౌనం అర్ధంగీకారమనుకోన లేక నీకు తగనని తెలుసుకోన
త్వరగ తెలిపి నా హృది సంఘర్షణకు తుదిపలుకు పలకవ
నీవు నాదానివైన కాకపోయిన సఖి నీ దోస్తుగ నేనుంట
నీ తోడు లేని జీవనంలో నే మోడుగానే వుంటా
వయసు మరీచికలో నీవు ఎప్పుడైన తడబడినప్పుడు
భావి జీవితం ఎప్పుడైన నీకు గడబిడగావునప్పుడు
నా గృహ ద్వారాలు సఖి నా మనసు లోగిళ్ళు నీకోసం తెరిచే వుంటాయి
ఈ భుజస్కందాలతో నీ భారము మోయుటకు నే సంసిద్దుడినైవుంట
నీ కష్టాలు బాధలు నావే అనుకుంట అవేవి నీకు లేకుండ నే చూసుకుంట
విసురజ

No comments:
Post a Comment