ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 28 February 2013

"ముగ్ధమోహనం" (10th chapter)
........................................
భయంతో వణికిపోయాడు యాసిక్...అతనికి మోహన మెంటాలిటీ తెలుసు...కొన్ని విషయాల్లో క్రూరంగా బిహేవ్ చేస్తుంది. గాలిని చీల్చుకుంటూ నైఫ్ యాసిక్ తలమీదుగా వెళ్లి వెనకన వున్న వార్డ్ రోబ్ లోకి దిగింది.
"నా గురి తప్పలేదు...నా టార్గెట్ నీ తల ఐతే ఈ పాటికి మొండెం నుంచి వేరయ్యేది" చాలా కూల్ గా చెప్పినా అందులో వార్నింగ్ వుంది.
యాసిక్ మౌనం గా వుండిపోయేడు. మోహనకు ఎదురు చెబితే ఏమవుతుందో అనుభవమే.
కొన్నాళ్ళ క్రితం మోహన ఇండియా వచ్చినప్పుడు మాదక ద్రవ్యాలు సప్లయ్ చేసే టోనీ మోహనను కలిసాడు. హెరాయిన్ టేస్ట్ చేస్తూ...వుండగా "అమ్మాయిలు వాడే హెరాయిన్ కాదు "అన్నాడు కాస్త వ్యంగంగా ...టోనీకి మోహన గురించి తెలియదు.
కిందికి వంగి ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకుని టోనీ తల మీద గట్టిగా కొట్టింది. టోనీ వేసిన కేక ఢిల్లీ నగరంలో ప్రతిధ్వనించింది.హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించిన టోనీ మనుష్యులను రివాల్వర్ తో బెదిరించింది. అంత బాధలోనూ టోనీ ప్రాణాలు కాపాడుకోవడానికి మోహన కాళ్ళ మీద పడిపోయాడు.
"ఇంకెప్పుడూ..హెరాయిన్ అమ్మకు..అమ్మినట్టు తెలిస్తే చస్తావ్" వార్నింగ్ ఇచ్చింది.
"చెప్పండి మేడం నన్ను ఏం చేయమంటారు?ఎవరిమీదైనా యాసిడ్ తో
ఎటాక్ చేయాలా ?"
"నాకు నీ ప్రాణాలు కావాలి "కూల్ గా అంది మోహన .
అదిరిపడ్డాడు...మేడం? అంటూ ఆగిపోయాడు.
మోహన చెప్పసాగింది. అంత చలిలోనూ...చెమటలు.
మాఫియాకు కూడా రాని భయంకరమైన ఆలోచన...ఇది..ఇది జరుగుతుందా?
మోహన ఇండియా రావడం వెనుక వున్న అసలు విషయం ఇదా?
అతని శరీరం కంపించింది.
************ ********************* **********************
"మీకో గుడ్ న్యూస్ "చెప్పాడు కారికేయ.
ఏమిటని అడగలేదు..ఏమిటన్నట్టు చూసింది ముగ్ధ.
"మీ ఫ్రెండ్ దొరికింది.ఎ టి ఏం నుంచి వస్తోంటే యాక్సిడెంట్ అయిందిట...ఎవరో హాస్పిటల్ లో చేర్పించారుట...
ఇందాకే స్పృహలోకి వచ్చిందట...నా సెల్ నుంచి వచ్చిన కాల్స్ చూసి ఫోన్ చేసింది...మీ గురించి కంగారుపడుతుంది" చెప్పాడు కార్తికేయ.
ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.
అప్పుడే దొరకాలా? మరో రెండు రోజులాగితే ఏమైంది? ముగ్ధ మనసులోని ఆలోచన.
తన ఆలోచన తనకే చిత్రంగా అనిపించింది. అవున్నిజం ...ఇప్పుడు కార్తికేయ తనను తన స్నేహితురాలి దగ్గరికి తీసుకు వెళ్తాడు...
"ఇదిగోండి మీ ఫ్రెండ్ అని చెబుతాడు...అది చాలా థాంక్స్ అంటుంది. తను అక్కడే వుండిపోతుంది.
కార్తికేయ ఇంటికి వెళ్ళిపోతాడు...ఇక తనకు కార్తికేయ క...ని.. పిం చ...డు ...
ఒక్క సారిగా ఏడుపు తన్నుకు వచ్చింది. కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. కార్తికేయ వైపు చూసింది
అతను సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని చొక్కా పట్టుకుని, నిలదీయాలని అనిపించింది..."
"మాట్లాడండి...సైలెంట్ గా వున్నారేంటి?" అడిగాడు కార్తికేయ
"ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?" ఉక్రోషంగా అడిగింది ముగ్ధ.
"మీ ఫ్రెండ్ దగ్గరికి "...అదేమిటి అలా అడిగారు?
" ఇంటికి వెళ్దాం " ముక్తసరిగా అంది.
"ఇంటికా?" కార్తికేయ గొంతులో ఆశ్చర్యమ్ ...
"మీ శారీస్ మీకు ఇచ్చి నా చీర తెచ్చుకుంటాను " ఏడుపు దిగమింగుతూ అంది...
ముగ్ధ వంక చూసాడు...గోదావరి ఆమె కళ్ళలో నుంచి ఉప్పొంగడానికి సిద్ధంగా వుంది.
అప్పుడే ఫోన్ కాల్.
.డిస్ ప్లే లో నంబర్ రాలేదు...అంటే ఆ ఫోన్ కాల్...?

No comments: